ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు దిమ్మ తిరిగేలా షాకిచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. కీలకమైన ఎన్నికల వేళ.. ఏపీలోని ప్రధాన పార్టీలకు చెందిన పలువురు నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారిపోతున్న విషయం తెలిసిందే. అనూహ్యంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఏ నేత.. ఏ పార్టీలో ఉంటున్నారు? అన్నది ఇప్పుడు పెద్ద సందేహంగా మారింది. ఒక రోజు ఒక పార్టీలో ఉన్న నేత.. మరో రోజు మరో పార్టీలో దర్శనమిస్తున్నారు.
ఇంత వేగంగా నేతలు కండువాలు మార్చుకోవటం ఇప్పుడే చూస్తున్నట్లుగా పలువురు సీనియర్ రాజకీయ నేతలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మంత్రి గంటా పోటీ చేసే నియోజకవర్గం ఏమిటో క్లారిటీ వచ్చేయటం.. ఆయనకు పోటీకి ఎవరిని తీసుకురావాలన్న జగన్ పార్టీ కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. బాబు ఆదేశాల నేపథ్యంలో విశాఖ వెస్ట్ నుంచి గంటా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనకు చెక్ పెట్టేందుకు వీలుగా జగన్ కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసినట్లుగా సమాచారం.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ద్రోణం రాజు శ్రీనివాస్ కు వైఎస్సార్ కాంగ్రెస్ కండువా కప్పేందుకు జగన్ రెఢీ కావటం. .ఆయన్ను గంటా మీద బరిలోకి దింపాలని భావిస్తున్నారు. దీనికి తగ్గ సమావేశాలు పూర్తి అయినట్లుగా చెప్పక తప్పదు. తమపార్టీ తరఫున గంటా మీద బరిలోకి దిగేందుకు ద్రోణం ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ద్రోణం 5769 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం ఏపీ పీసీసీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయన జగన్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గంటాకు బలమైన పోటీని ఇచ్చేందుకు వీలుగా జగన్ పార్టీ తెస్తున్న ద్రోణంతో మంత్రికి చిక్కులు తప్పవన్న మాట వినిపిస్తోంది.