కోర్టు ఆదేశాలతో అసెంబ్లీకి వచ్చేందుకు ప్రయత్నించిన వైసీపీ ఎమ్మెల్యే రోజాను శాసనసభలోనికి రానివ్వకుండా పోలీసులు - మార్షల్స్ అడ్డుకోవడం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రస్తుతం అసెంబ్లీ వద్ద హైడ్రామా నడుస్తోంది. జగన్ ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ గేటు బయట ఆందోళన చేస్తున్నారు. అయితే... అంతకుముందు పోలీసులు రోజా న్యాయవాదులను కూడా సభా ప్రాంగణంలోనికి అనుమతించలేదు. ఆ సందర్భంగా జగన్ జోక్యం చేసుకున్నా కూడా వారు ససేమిరా అన్నారు.దీంతో జగన్ ఆగ్రహించి నిబంధనలు మాట్లాడడంతో వారు వెనక్కు తగ్గారు.
రోజా తరఫున సుప్రీం కోర్టులో వాదించిన ఇందిరా జైసింగ్ ను అసెంబ్లీలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో జగన్ కలగజేసుకున్నారు. ఆమెను తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్తానన్నారు. మీరు ఎలా తీసుకెళ్తారని పోలీసులు ప్రశ్నించగా జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహించారు. ''ఆమెను నా కారులో తీసుకెళ్తా.... ఐ హ్యావ్ మై రైట్... ఐ కెన్ టేక్ ఎనీ బడీ'' అంటూ తీవ్ర స్వరంతో చెప్పారు. నా ఆఫీసుకు తీసుకెళ్తా.... కావాలంటే నా తరఫున పాస్ పంపిస్తాను అని పోలీసులతో అనే సరికి వారు ఇంకేం మాట్లాడలేకపోయారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ను కలిసేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లేందుకు పాస్ ను జారీ చేస్తాననేసరికి పోలీసులు వెనక్కు తగ్గి ఇందిరా జైసింగ్ ను లోనికి పంపించారు.