జ‌గ‌న్ కేబినెట్లో ఆ నాలుగు జిల్లాల‌కు పెద్ద‌పీట‌!

Update: 2019-06-09 06:20 GMT
ఏపీలో మొత్తం ప‌ద‌మూడు జిల్లాలు ఉన్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు చూస్తే.. ఆ జిల్లా.. ఈ జిల్లా అన్న తేడా లేకుండా అన్ని జిల్లాలు జ‌గ‌న్ కు జై కొట్టాయి. 2014తో పోలిస్తే 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మీద ప్ర‌త్యేక అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించిన జిల్లాలు కొన్ని ఉన్నాయి. వ్యూహాత్మ‌కంగా చూసినా.. ఈ జిల్లాల్లో ప‌ట్టు సాధిస్తే.. అధికారానికి తిరుగులేన‌ట్లేన‌ని చెప్పాలి. తాజాగా కేబినెట్ ను కొలువు తీర్చిన జ‌గ‌న్‌.. స‌మానుల్లో ప్ర‌ధ‌ముల మాదిరి మొత్తం 13 జిల్లాల్లో నాలుగు జిల్లాల‌కు అమిత ప్రాధాన్యం ఇచ్చిన‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు.

మంత్రుల‌కు కేటాయించిన శాఖ‌ల‌తో పాటు.. కొన్ని జిల్లాల‌కు చెందిన నేత‌ల‌కు అప్ప‌జెప్పిన బాధ్య‌త‌ల్ని చూస్తే.. ప‌ద‌మూడు జిల్లాల్లో నాలుగు జిల్లాల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌జెప్పిన‌ట్లుగా చెప్పక త‌ప్ప‌దు. శాఖ‌ల కేటాయింపులో ప్రాధాన్య‌త ల‌భించిన జిల్లాల విష‌యానికి వ‌స్తే.. ఇందులో మొద‌టగా తూర్పుగోదావ‌రి జిల్లా నిలుస్తుంది. అనంత‌రం ప్ర‌కాశం.. నెల్లూరు.. చిత్తూరు జిల్లాలకు ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న క‌డ‌ప జిల్లాల‌కు పెద్ద ప్రాధాన్య‌త ఇవ్వ‌టం ద్వారా జ‌గ‌న్ విమ‌ర్శ‌ల‌కు చెక్ చెప్పార‌ని చెప్పాలి. అదే స‌మ‌యంలో.. అత్య‌ధిక నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్న తూర్పు గోదావ‌రి జిల్లాకు ప్రాధాన్య‌త ఇవ్వ‌టం వ్యూహాత్మ‌కంగా చెప్ప‌క త‌ప్ప‌దు. అదే స‌మ‌యంలో త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి.. విప‌క్ష నేత చంద్ర‌బాబుకు ప్రాతినిధ్యం వ‌హించే చిత్తూరు జిల్లాకు ప్రాధాన్య‌త ఇవ్వ‌టం ద్వారా.. ప్ర‌త్య‌ర్థి కోట‌లో పాగా వేయాల‌న్న జ‌గ‌న్ ఆలోచ‌న‌ను చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లుగా చెప్పాలి.  

రాష్ట్ర పాల‌న‌లో కీల‌క శాఖ‌లుగా చెప్పే రెవెన్యూ.. రిజిస్ట్రేష‌న్లు.. వ్య‌వ‌సాయం.. సాంఘిక సంక్షేమ శాఖ‌లు తూర్పు గోదావ‌రి జిల్లాల‌కు ల‌భిస్తే.. ప్ర‌కాశం జిల్లా నుంచి మంత్రులుగా ఎంపికైన వారికి విద్యుత్.. అట‌వీ.. విద్యాశాఖ‌లు ద‌క్కాయి. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రుల‌కు పంచాయితీరాజ్.. గ్రామీణాభివృద్ధి.. గ‌నులు.. ఎక్సైజ్.. వాణిజ్య ప‌న్నుల శాఖల్ని కేటాయించారు. ఇలా చూసిన‌ప్పుడు మొత్తం 13 జిల్లాల్లో నాలుగు జిల్లాకు జ‌గ‌న్ అగ్ర ప్రాధాన్యం ఇవ్వ‌టం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించ‌క మాన‌దు.
Tags:    

Similar News