వైఎస్ కుటుంబానికి నమ్మినబంటుగా వ్యవహరిస్తూ వస్తున్నారు విజయసాయిరెడ్డి. వైఎస్ కుటుంబంతో ఆయనకు రాజారెడ్డి కాలం నుంచి అనుబంధం ఉందనేది ఇది వరకే తెలిసిన అంశం. ఇక కాంగ్రెస్ నుంచి విబేధించి బయటకు వచ్చాకా జగన్ పై సీబీఐ కేసులను పెట్టినప్పుడు విజయసాయిరెడ్డినే ముందుగా అరెస్టు చేశారు. విచారణ పేరుతో ఆయనను గంటల తరబడి కూర్చోబెట్టి సాయంత్రానికి ఇంటికి పంపించడం, చివరకు అరెస్టు చేయడం జరిగింది. అయినా వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఎక్కడా చిన్న స్టేట్ మెంట్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు విజయసాయిరెడ్డి. జగన్ పై నమోదైనవి అక్రమ కేసులే అనే పాయింట్ హైలెట్ అయ్యేందుకు సాయిరెడ్డి వ్యవహరించిన తీరు కూడా ఒక నిదర్శనంగా నిలిచింది.
ఇక పార్టీ తరఫున రాజ్యసభకు ఎవరినైనా నామినేట్ చేసే అవకాశం వచ్చినప్పుడు మరో ఆలోచన లేకుండా విజయసాయిరెడ్డినే ఢిల్లీకి పంపించారు జగన్ మోహన్ రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు విజయసాయి రెడ్డిని నామినేట్ చేశారు జగన్ మోహన్ రెడ్డి. అదేదో ప్రతిఫలంగా దక్కిన పదవిగా భావించలేదు విజయసాయి రెడ్డి. ఢిల్లీలో ఆయన చక్రం తిప్ప సాగారు.
ఎంతగా అంటే.. విజయసాయిరెడ్డి ఢిల్లీలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉండే సరికి తెలుగుదేశం పార్టీ కూడా అవాక్కయ్యింది. ఆయనపై రాజకీయంగా కూడా విమర్శలు మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. అలా తన చాతుర్యాన్ని - చాణక్యాన్ని నిరూపించుకున్నారు విజయసాయిరెడ్డి.
ఇక ఇప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డికి జగన్ మోహన్ రెడ్డి కీలకమైన పదవిని ఇవ్వనున్నారనే మాట వినిపిస్తోంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా సాయిరెడ్డికి అవకాశం ఇవ్వనున్నారని సమాచారం.
కేబినెట్ ర్యాంకుతో సహా మరి కొన్ని పవర్స్ ఉంటాయి ఆ పదవికి. ఆ మేరకు విజయసాయి రెడ్డికి జగన్ అవకాశం ఇవ్వనున్నారని.. సాయి రెడ్డిని ఢిల్లీ వ్యవహారాలను సమీక్షించే బాధ్యతలను అప్పగించనున్నారని సమాచారం. ఇప్పటి వరకూ ఢిల్లీ వ్యవహారాల్లో రాణించడంతో ఆయనకు అక్కడ మరిన్ని అధికారాలు ఇస్తూ అటు రాజకీయ వ్యవహారాలను - ఇటు రాష్ట్రానికి సంబంధించి బాధ్యతలను జగన్ మోహన్ రెడ్డి ఆయనకు అప్పగించనున్నారని వార్తలు వస్తున్నాయి.