బెజవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. పార్టీలో కీలకమైన వంగవీటి రాధకు దిమ్మ తిరిగిపోయేలా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు వంగవీటి వర్గానికి ఏ మాత్రం మింగుడుపడటం లేదంటున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేతకు సన్నిహితుడైన వ్యక్తికి పార్టీ పదవి దక్కటంపై వంగవీటి రాధ అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. రాధకు అసంతృప్తి కలిగేలా జగన్ తీసుకున్న నిర్ణయం ఏమిటి? అందుకు రాధా అభ్యంతరం ఏమిటి? జగన్ ను కలిసి తన అసంతృప్తిని చెప్పిన రాధకు అధినేత నుంచి వచ్చిన ఆన్సర్ ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే..
బెజవాడలో వంగవీటి రాధాకు.. గౌతంరెడ్డికి మధ్యనున్న విభేదాలు అందరికి తెలిసినవే. తన తండ్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో గౌతంరెడ్డిని రాధా తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. అదే సమయంలో గౌతంరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ పార్టీలో కంటిన్యూ కావటం ఒక విశేషమైతే.. తాజాగా గౌతంరెడ్డి అనుచరుడు నాగూర్ కు తాను ఇన్ ఛార్జ్ గా ఉన్న నియోజకవర్గంలో పార్టీ పదవిని కట్టబెట్టటంపై వంగవీటి రాధా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. మరోవైపు పార్టీ నుంచి సస్పెండ్ అయిన గౌతంరెడ్డి.. అధినేతకు బంధువైన అవినాష్ రెడ్డితో భేటీ అయిన ఫోటో బయటకు వచ్చి వైరల్ కావటం కూడా వంగవీటి వర్గానికి మింగుడుపడనిదిగా మారింది.
దీనికే ఉడికిపోతున్న వారికి.. తాజాగా తాను ఇన్ ఛార్జ్ గా ఉన్న నియోజకవర్గంలో గౌతంరెడ్డి అనుచరుడికి పదవి ఇవ్వటాన్ని సహించలేకపోతున్నారు రాధా. తన మనసులోని అసంతృప్తిని పార్టీ అధినేత జగన్ తో నేరుగా చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే.. గౌతంరెడ్డి అనుచరుడు నాగూర్ కు మైనార్టీలో పట్టు ఉందని.. మంచి పేరు కూడా ఉండటంతో ఆయన్ను ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. తన వర్గానికి చెందిన నేతను కాకుండా వైరి వర్గానికి చెందిన నేతను అధినేత ఎంపిక చేయటంపై వంగవీటి రాధా అసంతృప్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ అసంతృప్తి ఎక్కడి వరకూ వెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పాలి.