నిత్యం విధి నిర్వహణలో క్షణం కూడా తీరికలేకుండా గడిపే జర్నలిస్టుల బీమాను మరో ఏడాది పాటు పొడగించాలని జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జర్నలిస్ట్ బీమాను 2020-21 ఏడాదికి కూడా వర్తింపజేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2020-21 సంవత్సరానికి వైఎస్సార్ జర్నలిస్ట్ బీమా అమలు కోసం రూ.42.63 లక్షల అదనపు నిధుల కేటాయించింది.. దీంతో ఏపీలో 21 వేల మంది వర్కింగ్ జర్నలిస్టులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియాకు చెందిన జర్నలిస్టులు ఉన్నారు. ఒకవేళ ప్రమాదవశాత్తు సదరు జర్నలిస్టు చనిపోతే రూ.10 లక్షల బీమాను కుటుంబసభ్యులకు అందజేయనున్నారు.
కాగా , గతేడాది బీమా పేరును వైఎస్ ఆర్ జర్నలిస్ట్ బీమాగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. సమగ్ర బీమా పథకాన్ని.. వైఎస్ ఆర్ జర్నలిస్టు బీమాగా పేరు మార్చారు. జర్నలిస్టు బీమాను ఏడాది పొడగించడంపై జర్నలిస్టు సంఘాలు, నేతలు హర్షం వ్యక్తం చేశారు. మరో ఏడాది పొడగించడాన్ని స్వాగతించారు. దీంతో తమ మిత్రులకు ప్రయోజనం కలుగుతోందన చెప్పారు. కరోనా విజృంభిస్తోన్న సమయంలో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని తెలిపారు.