విద్యా రంగంలో జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యా వసతి, జగనన్న గోరుముద్ద ఇలా పలు పథకాలను అమలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో విద్యా ప్రమాణాలు, బోధనాభ్యసనాన్ని మరింత పెంచడానికి సంచలన నిర్ణయం తీసుకుంది. బోధనాభ్యసనేతర వ్యవహారాల నుంచి టీచర్లను మినహాయించింది. ఇన్నాళ్లూ ప్రభుత్వ టీచర్లను వివిధ ప్రభుత్వ సర్వేల కోసం, జనాభా లెక్కల కోసం, ఎన్నికల వ్యవహారాల కోసం, ఆరోగ్య సంబంధిత సర్వేల కోసం ఇలా పలు పనులకు ప్రభుత్వ టీచర్లను వినియోగిస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇక నుంచి వీరిని అలాంటి పనుల నుంచి మినహాయించనుంది. ఈ మేరకు తాజాగా జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం అటు విద్యార్థులకు, టీచర్లకు ప్రయోజనం చేకూర్చనుందని ప్రభుత్వం భావిస్తోంది.
టీచర్లకు వారికి సంబంధం లేని పనులు అప్పగించడం వల్ల విద్యార్థుల సమగ్ర పురోభివృద్ధి తింటున్న నేపథ్యంలో టీచర్లకు విద్యేతర కార్యక్రమాలు అప్పగించవద్దని నిర్ణయించింది. ఈ మేరకు ఉపాధ్యాయులను పూర్తిగా విద్యా కార్యక్రమాలకే పరిమితం చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ఉపాధ్యాయులను విద్యేతర కార్యక్రమాల నుంచి తప్పిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ (పాఠశాల విద్య) జీవో 185 జారీ చేశారు.
జగన్ ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో బోధనాభ్యసన ప్రక్రియ, విద్యా సంబంధిత కార్యక్రమాలు సమగ్రంగా కొనసాగే వీలుందని అంటున్నారు. తద్వారా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. స్కూళ్లలో బోధనేతర కార్యక్రమాల బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయాల సంక్షేమ, విద్యా అసిస్టెంట్లకు ఇప్పటికే అప్పగించడం గమనార్హం.
టీచర్లు కూడా తమను విద్యేతర కార్యక్రమాల నుంచి తప్పించాలని ఎప్పటి నుంచో ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీంతో టీచర్లను విద్యేతర కార్యక్రమాలకు వినియోగించుకోవడం వల్ల విద్యార్థులకు బోధించేవారు ఉండటం లేదు. అలాగే మరికొంత మంది టీచర్లు ఇతర విభాగాలకు డిప్యుటేషన్లపై వెళ్లిపోతున్నారు. ఇక ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు, పదవీ విరమణ చేయడం వల్ల ఏర్పడ్డ ఖాళీలు ఇలా కొన్ని చోట్ల సరిపోయినంత సంఖ్యలోనూ టీచర్లు ఉండటం లేదు. దీంతో బోధనాభ్యసన ప్రక్రియలు కుంటుపడుతున్నాయి.
ఇలా మొత్తం టీచర్లలో 5 శాతం మంది పాఠశాలలకు దూరం కావడం విద్యార్థుల బోధనపై ప్రభావం చూపుతోంది. ఇదే అంశంపై సుప్రీంకోర్టు సైతం ఇప్పటికే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్లకు విద్యేతర కార్యక్రమాలను అప్పగించరాదని, ఇతర విధుల్లో ఉంటున్న వారిని వెంటనే వెనక్కు రప్పించాలని గడువు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ గత ఏడాది ఇతర శాఖల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న వారిని వెనక్కు రప్పించి పాఠశాలల్లో బోధనకు వీలుగా పునర్నియామకం చేసింది. ఇప్పుడు పూర్తిగా టీచర్లను విద్యేతర కార్యక్రమాల నుంచి తప్పిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
టీచర్లు పాఠశాలల్లో పూర్తిగా విద్యా కార్యక్రమాల్లో నిమగ్నం కావడం వల్ల విద్యార్ధులకు పూర్తిస్థాయిలో బోధన అందే అవకాశం ఉంది. టీచర్లు తమ బాధ్యతలపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.