సరిగ్గా పదేళ్ల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలు విషాదంలో మునిగిపోయిన రోజు. ప్రజల మనసుల్ని దోచుకున్న ప్రజానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు పయనం కావటం తెలిసిందే. సంక్షేమ పథకాలతో సరికొత్త చరిత్రను క్రియేట్ చేసిన ఆయన.. తర్వాతి కాలంలో ఆయన స్టార్ట్ చేసిన పథకాల్ని దేశమంతా అమలు చేస్తున్న పరిస్థితి.
వైఎస్ బతికి ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయే పరిస్థితి ఉండేది కాదన్న మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. ఒక నేత మరణించి పదేళ్లు అయిన తర్వాత.. వారి గురించి స్మరించుకోవటం తగ్గుతుంది. దీనికి మినహాయింపుగా వైఎస్ ను చెప్పాలి. ఆయన మరణించి నేటికి పది రోజులు అయినప్పటికీ ఆయన గురుతులు మాత్రం తెలుగు ప్రజల్ని విడిచిపెట్టకపోగా.. అదే పనిగా ఆయన్ను స్మరించుకునేలా చేస్తుందని చెప్పాలి.
వైఎస్ వర్థంతి నేపథ్యంలో.. తండ్రి గురుతుల్ని మరోసారి ప్రస్తావించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తన తండ్రికి సంబంధించి ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రజానేతగా.. ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహానేతను.. ఆయన పాలనను ఉద్దేశించి జగన్ చేసిన ట్వీట్ పలువురిని ఆకట్టుకుంటోంది.
పాలన.. ప్రజాసంక్షేమం విషయంలో నాన్న నిర్ణయాలు మొత్తం దేశానికే మార్గదర్శకాలయ్యాయి. రాష్ట్రాన్ని నాన్న నడిపించిన తీరు జాతీయ స్థాయిలో గర్వించేలా చేసింది. నాన్న భౌతికంగా దూరమైనా.. పథకాల రూపంలో బతికే ఉన్నారు. ఆయనిచ్చిన స్ఫూర్తి మనల్ని ఎప్పటికి విలువల బాటలో నడిపిస్తూనే ఉంటుందంటూ ఆయన ట్వీట్ చేశారు.