రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నమైన కడప ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 26 తేదీన శంకుస్థాపన చేయనున్నారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి - పెద్దదండ్లూరు గ్రామాల పరిధిలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కంపెనీని ఏర్పాటు చేసి.. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ - మైనింగ్ శాఖ కార్యదర్శి కె.రాం గోపాల్ లను డైరెక్టర్లుగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర విభజన సమయంలో కడపలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇవ్వడం తెలిసిందే. అయితే ఐదేళ్లు గడిచినా అది కార్యరూపం దాల్చకపోవడం తెలిసిందే.కాగా రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తీసుకు రావడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని తమ మేనిఫెస్టోలో చెప్పిన వైఎస్ జగన్.. ఇందులో భాగంగా కడప ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
2013 కంపెనీల చట్టం ప్రకారం ఈ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు. వంద శాతం పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వమే పెడుతుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం 2019 - 20 బడ్జెట్ లో రూ. 250కోట్లను కేటాయించారు. పరిశ్రమశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ - గనుల శాఖ కార్యదర్శి కె.రామ్ గోపాల్ ను డైరెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.