మిస్ యూ షర్మి పాప.. జగన్ ఉద్వేగం

Update: 2018-08-26 09:43 GMT
సోదర సోదీరమణుల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్.. ఈ రాఖీ పండుగ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతోంది. అందరూ తమ తమ ఇళ్లల్లో వేడుకను జరుపుకుంటున్నారు. అక్కలు, చెల్లెల్లు తమ సోదరులకు రాఖీ కడుతున్నారు.ఈ పండుగను అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నా.. ఒక్కరు మాత్రం ప్రజల కోసం ఈ పండుగను త్యాగం చేశారు.తన సొంతూరుకు దూరంగా పాదయాత్రలో ఉండడంతో వెళ్లలేకపోయారు. ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రజలతో మమేకమైన జగన్ ఈ సారి రాఖీపండుగ సందర్భంగా ట్విట్టర్ లో ఉద్వేగానికి గురయ్యారు. తన చెల్లెలు షర్మిలను మిస్ అవుతున్నానని భావోద్వేగంతో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

వైఎస్ జగన్ ట్వీట్ చేస్తూ.. ‘మిస్సింగ్ యూ ఆన్ రాఖీ.. షర్మీపాప. బ్లెస్సింగ్ ఆల్వేస్’ అంటూ ఆప్యాయంగా రాసుకొచ్చారు. తన చెల్లెలని షర్మీపాప అంటూ పిలుస్తూ జగన్ భావోద్వేగానికి గురయ్యారు.  ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని అందరూ చెల్లెల్లకు తన రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం విశాఖ జిల్లా ధారభోగాపురం వద్ద రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. జగన్ కు ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు మహిళా నేతలు రాఖీ కట్టారు.
Tags:    

Similar News