వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపటి క్రితం త్రిదండి చినజీయర్ స్వామితో బేటీ అయ్యారు. తన పార్టీ ప్రధాన కార్యదర్శి - రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డిని వెంటబెట్టుకుని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ లో కొనసాగుతున్న జీయర్ ఆశ్రమానికి వెళ్లిన జగన్... స్వామితో భేటీ అయ్యారు. నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లిన జగన్... అక్కడ ఇండియా టుడే కాన్ క్లేవ్ లో కీలక ప్రసంగం చేసి తిరిగి వచ్చారు. ఈ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న జగన్... శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా జీయర్ ఆశ్రమానికి వెళ్లారు. ఆశ్రమం వద్ద తనకు సాదర స్వాగతం పలికిన జీయర్ కు జగన్ పాదాభివందనం చేశారు.
ఆ తర్వాత జీయర్ తో కలిసి ఆశ్రమంలోకి వెళ్లిపోయిన జగన్... చాలాసేపు జీయర్ తో భేటీ అయ్యారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైన నేపథ్యంలో జగన్.. జీయర్ తో భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలోనూ పలుమార్లు జీయర్ వద్దకు వెళ్లిన జగన్... పలుమార్లు భేటీ అయ్యారు. అయితే ఇప్పుడు సరిగ్గా ఏపీ ఎన్నికలకు ముందు జగన్... జీయర్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని - జీయర్ ను జగన్ కలవడంలో పెద్దగా విశేషమేమీ లేదని - ఇదివరకు కూడా జగన్ పలుమార్లు జీయర్ ను కలిశారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.