జగన్ సర్కారు వివాదాస్పద జీవో..జర్నలిస్టుల రాష్ట్రవ్యాప్త ఆందోళనలు!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో విడుదలైన ఓ జీవోపై వివాదం చెలరేగుతోంది. నిరాధార వార్తలు రాసినా - ప్రచురించినా - ప్రసారం చేసినా - సామాజిక మాధ్యమాల్లో ఉంచినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆయా శాఖల కార్యదర్శులకు అధికారాలు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు రాస్తే ఇకపై పరువు నష్టం కింద నోటీసులు జారీ చేసేందుకు కార్యదర్శులకు అధికారం కల్పించారు. దీనిపై జర్నలిస్టు సంఘాలు భగ్గుమంటున్నాయి.మీడియా స్వేచ్ఛను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జోఓ 2430 ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఏపీయుడబ్ల్యూ జే,) డిమాండ్ చేసింది. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు సంఘం నేతలు ఒక ప్రకటనలో తెలిపారు
మీడియా స్వేచ్ఛను హరించే జీఓను రద్దు చేయాలని ఏపీయూడబ్ల్యూజే తరఫున నేతలు డిమాండ్ చేశారు. నవంబర్ ఒకటిన రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా - రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి - ప్రజా ప్రతినిధులు - అధికారులకు వినతి పత్రాలు అందించటంతో పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వారు కోరారు. జర్నలిస్టులతో పాటు ప్రజాస్వామిక వాదులు కలిసిరావాలని వారు విజ్ఞప్తి చేశారు. పత్రికలు - టీవీ ఛానళ్లు తో పాటు సామాజిక మాధ్యమాల పైన ప్రభుత్వం కక్షసాధింపుగా వ్యవహరిస్తుంది అనేందుకు ఈ జీఓ తీసుకు రావటమే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం జీఓను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేయటం జరుగుతోందని హెచ్చరించారు. కలిసివచ్చే రాజకీయ పార్టీలు - ప్రజా సంఘాలు - ప్రజాస్వామిక వాదులను కలుపుకొని ముందుకు పోవటం జరుగుతుందని - ప్రభుత్వం ఇప్పటికైనా జీఓ వెనక్కి తీసుకోవాలనిసూచించారు.
కాగా, చీకటి జీఓ తో జగన్ పతనం ఆరంభమైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు - మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పతనమయ్యేలా - భావప్రకటనా స్వేచ్ఛను బలిపీఠంపై నిలబెట్టేలా ప్రభుత్వం జీఓ 2430ని తీసుకొచ్చిందని మండిపడ్డారు. తండ్రిని తలదన్నేలా జగన్ నియంతృత్వ పోకడలు పోతున్నాడని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు చదివితే సాక్షి పత్రికే చదవాలి...చూస్తే సాక్షి ఛానలే చూడాలన్నట్లుగా జగన్ నిర్బంధకాండను అమలు చేస్తున్నాడని విమర్శించారు. ప్రభుత్వం తక్షణం జీఓను రద్దుచేయకుంటే - తెలుగుదేశం తరుపున పోరాడతామని స్పష్టం చేశారు.