జ‌గ‌న్ పాద‌యాత్ర‌లోనే అవిశ్వాస తీర్మానం ఆలోచ‌న‌!

Update: 2018-03-17 16:54 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల అమ‌లు పై కేంద్రం వైఖ‌రిని వైసీపీ చాలా కాలం నుంచి విమ‌ర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కూడ‌ద‌ని 14 వ ఆర్థిక సంఘం ఎక్క‌డా చెప్ప‌లేద‌ని వివ‌క్ష‌ను వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ ప‌లుమార్లు స్ప‌ష్టం చేశారు. గ‌త నెల 13 న నెల్లూరులో జ‌రుగుతున్న ప్రజా సంక‌ల్ప యాత్ర సంద‌ర్భంగా ....చేసిన ప్ర‌క‌ట‌న జాతీయ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఏప్రిల్ 6వ తేదీలోపు ఏపీకి ప్ర‌త్యేక హోదాను కేంద్రం ప్ర‌క‌టించ‌క‌పోతే త‌మ ఎంపీలు రాజీనామాలు చేస్తార‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కు....కేంద్ర ప్ర‌భుత్వం పై ఈ నెల 21న వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌బోతోందంటూ జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న ఇటు రాష్ట్రంలోని టీడీపీ...అటు కేంద్రంలోని బీజేపీ వెన్నులో వణుకు పుట్టించింది. జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇర‌కాటంలో ప‌డ్డారు.

జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో అప్ప‌టివ‌ర‌కు గోడ‌మీద పిల్లి వాటం ప్ర‌ద‌ర్శించిన చంద్ర‌బాబు.....త‌ప్ప‌ని సరిగా జ‌గ‌న్ దారిలో న‌డ‌వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. త‌మ‌కంటే ముందు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి - అవిశ్వాసం ప్ర‌వేశ‌పెడితే....ఆ మైలేజీ వైసీపీ కొట్టేస్తుంద‌ని చంద్ర‌బాబు భావించారు. దీంతో, కేంద్ర మంత్రులతో రాజీనామాలు చేయించారు. దాంతోపాటు, ఎన్డీఏతో టీడీపీ తెగ‌దెంపులు చేసుకుంటోంద‌ని శుక్ర‌వారం నాడు ప్ర‌క‌టించారు. అంతేకాదు - పార్ల‌మెంటులో వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెడితే తాము మ‌ద్ద‌తిస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. అయితే, నిన్న వైసీసీ అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని, తాముకూడా అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని చంద్ర‌బాబు యూట‌ర్న్ తీసుకున్నారు. జ‌గ‌న్ కు క్రెడిట్ ద‌క్క‌డం ఇష్టం లేని చంద్ర‌బాబు పైచేయి సాధించేందుకు ఈ విధంగా చేశారు. అయితే, త‌న‌కు రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని, ఏపీకి ప్ర‌త్యేక హోదా ద‌క్కాల‌ని, ఎవ‌రి అవిశ్వాస తీర్మానాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నార‌న్న‌ది ముఖ్యం కాద‌ని త‌న ఉదార‌త‌ను జ‌గ‌న్ చాటుకున్నారు. అయినా, అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టాల‌ని మొద‌ట ప్ర‌తిపాదించింది తామేన‌ని, ఇప్ప‌టికైనా టీడీపీ త‌మ అడుగుజాడ‌ల్లో న‌డిచినందుకు సంతోష‌మ‌ని జ‌గ‌న్ అన్నారు.

ప్ర‌స్తుతం లోక్ స‌భ‌లో బీజేపీకి 275 మంది ఎంపీలున్నారు. శివ‌సేన‌(18)తో క‌లుపుకుంటే ఆ సంఖ్య 315 కు పెరుగుతుంది. వివిధ పార్టీలకు చెందిన  మ‌రో 22 మంది ఎంపీలు ఎన్డీఏ కూట‌మికి మ‌ద్ద‌తిస్తున్నారు. 150 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తిస్తున్నారు. 68 మంది ఎంపీలు త‌ట‌స్థంగా ఉన్నారు. అయితే, ఏప్రిల్ 6లో బ‌డ్జెట్ స‌మావేశాలు ముగియ‌నున్న నేప‌థ్యంలో టీడీపీ - వైసీపీలను ఏక‌తాటిపైకి తెచ్చి ఒకే అవిశ్వాస తీర్మానం ఓటింగ్ కు వ‌చ్చేలా సీపీఎం - ఎస్పీ - బీఎస్పీ - తృణ‌ముల్ కాంగ్రెస్ లు కృషి చేస్తాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా. ఏది ఏమైనా ఈ స‌మావేశాల్లో అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్ జ‌ర‌గ‌డం క‌ష్ట‌మ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే, ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసే ప‌క్షంలో .....త‌మ ఎంపీల‌తో కూడా చంద్ర‌బాబు త‌ప్ప‌క రాజీనామా చేయించాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయి. మ‌రి అపుడు చంద్ర‌బాబు ఏవిధంగా స్పందిస్తారో అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.
Tags:    

Similar News