సుమారుగా ఆరు నెలల కిందట రాజ్యసభ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఆపరేషన్ ఆకర్ష్ గుర్తుండే ఉంటుంది. ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలపై అధికార వల వేయడంతో దాదాపు 20 మంది జంపయ్యారు. అదే సీన్ ఇపుడు రిపీట్ అవుతోందని అంటున్నారు. ఇప్పటివరకు పెండింగ్ లో ఉండి త్వరలో జరగబోయే కార్పోషన్-మున్సిపాలిటీలకు ఎన్నికల నేపథ్యంలో మరోసారి అధికాపక్షం వలసలకు పచ్చజెండా ఊపింది. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆ పార్టీని వీడి అధికార టీడీపీ తీర్థం పుచ్చుకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ మొదలవుతున్నట్లు కనిపిస్తున్న ఈ జంప్ ల పర్వాన్ని వైసీపీ రాజకీయ కోణంలో చూస్తోంది.
రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండా పెండింగ్ లో నున్న కర్నూలు - తిరుపతి - శ్రీకాకుళం గ్రేటర్ విశాఖ - కాకినాడ - గుంటూరు - ఒంగోలు మున్సిపల్ కార్పో రేషన్లకు రాజంపేట - రాజమండ్రి. నెల్లిమర్ల - కందుకూరు మున్సిపాలిటీలకు త్వరలో ముహుర్తుం ఖరారు కానున్నది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో విజయం కోసం అధికార టీడీపీతోపాటు అన్ని పక్షాలు జోరుగానే సన్నద్దమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో స్థానికంగా అవగాహన చేసుకోవాలని భావిస్తున్న ఆ పార్టీ గెలుపుపైన కూడా అంతే పకడ్భందీగా ముందుకెళ్తున్నట్లు సమాచారం. అయితే రాజ్యసభ ఎన్నికల నాటి పరిణామాలను ఈ దఫా వైసీపీ గుర్తుచేసుకుంటోంది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 20 మంది ఎమ్మెల్యేలను టీడీపీ వల వేసిన విషయం తెలిసిందే. అయితే అనుకొన్న మేర వైసీపీ ఎమ్మెల్యేలు తనవైపునకు రాకపోవడంతో తనకున్న బలానికి మించి రాజ్యసభ సభ్యుడిని ఎన్నికల బరిలోకి టీడీపీ దించలేదు. దీంతో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఇప్పుడు పెండింగ్ లోనున్న కార్పోరేషన్ - మున్సిపల్ ఎన్నిక లకు షెడ్యూల్ వెలువడితే ఈ ఎన్నికల్లో విజయం కోసం కూడా అధికార టీడీపీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుందా అన్న కోణంలో వైసీపీ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఉప్పులేటి కల్పన పార్టీని వీడిపోవడంతో రాజకీయ కోణంలో మళ్లీ వైసీపీ నాయకత్వం సమాలోచనలు చేస్తోంది. అయితే రాష్ట్రంలో టిడిపి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్న తరుణంలో ఇప్పు డు జరిగే పెండింగ్ మున్సిపల్ - కార్పోరేషన్ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ క్రమంలోనే పెండింగ్ కార్పోరేషన్ - మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీతో తలపడటంతోపాటు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు - ఆయా పరిధిలోని స్థానిక బలమైన నేతలు చేజారకుండా చూసుకోవాలని వైసీపీ సమాలోచనలు చేస్తోంది. ఈ ఎన్నికలు జరిగే అవకాశమున్న కార్పోరేషన్ - మున్సిపాలిటీ పరిధిలో కూడా ఎమ్మెల్యే - నేతలను తనవైపు ఆకర్షించే యత్నం టీడీపీ మొదలెడితే మాత్రం పార్టీకి కొంత నష్టమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ మళ్లీ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించే అవకాశముందన్న సమాచారం అందుకోవడంతో వైసిపి నాయకత్వం ఆ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఎమ్మెల్యే - నేతలతో వైసీపీలోని సీనియర్ నేతలు మంతనాలు - నిరంతర సమన్వయం చేసుకొంటున్నట్లు సమాచారం. ఇదే విషయమై వైసీపీ సీనియర్ నేతల వద్ద ప్రస్తావన తీసుకురాగా ఇప్పుడు టీడీపీ వైపు వెళ్లే ఎమ్మెల్యేలు ఎవరు ఉండరని వారు పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో ఏపీకి ప్రత్యేకహోదా అంశంలో ఇప్పటికే టీడీపీపై ప్రజాగ్రహం ఉందని ఎన్నికలు మరో రెండున్నరేళ్ల సమయం ఉన్నందున తమ పార్టీ నుంచి అధికార పార్టీలోకి వెళ్లే ఎమ్మెల్యేలు ఉండకపోవచ్చని వైసీపీ సీనియర్ నేతలు వ్యాఖ్యనిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులు నేరుగా జరగకపోయినా పరక్షంగా తమ పార్టీని దెబ్బతీసే చర్యలు టీడీపీ చేపట్టే ప్రమాదం లేకపోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే జగన్ ప్రజా సమ్యలపై ఆందోళనల మొదలుపెట్టారని చెప్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/