కరోనా మహమ్మారి నేపథ్యంలో జీఎస్టీ ఆదాయం భారీగా పడిపోయింది. రెవెన్యూ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వలేని పరిస్థితి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల ముందు రెండు ఆప్షన్స్ ఉంచింది. జీఎస్టీ ఆదాయం తగ్గడం పక్కన పెడితే.. ఈ అంశాన్ని బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. జీఎస్టీ నష్టభారాన్ని కేంద్రమే భరించాలని, ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో సాయానికి బదులు కోత విధిస్తోందని కేంద్రంపై పంజాబ్ - తెలంగాణ - చత్తీస్ గఢ్ - రాజస్థాన్ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మండిపడుతున్నాయి.
జీఎస్టీ నిధులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీకి ఘాటుగా లేఖ రాశారు. ఇంత జరుగుతున్నా ఈ నిధులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి చప్పుడూ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ లేదా ప్రతిపక్షాలు దీని గురించి మాట్లాడక పోవడం పై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ విషయంలో జగన్ - పవన్ కళ్యాణ్ - చంద్రబాబులు ఒక్కటిగా ఉన్నారని సెటైర్లు వేసుకుంటున్నారు. జీఎస్టీ నిధుల గురించి పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం గట్టి గా నిలదీస్తుంటే జగన్ మాట్లాడటం లేదని, అలాగే తెలంగాణ కాంగ్రెస్ అన్యాయం జరిగిందని విమర్శలు గుప్పిస్తుంటే, ఏపీ లో మాత్రం ప్రతి పక్ష టీడీపీ - జనసేన పవన్ కళ్యాణ్ లు ఏమీ మాట్లాడడం లేదని గుర్తు చేస్తున్నారు.
జగన్ కనీసం జీఎస్టీ నిధుల గురించి మాట్లాడటమే లేదని, కేంద్రానికి లేఖలు రాయడం లేదని అంటున్నారు. అలాగే, ప్రతి విషయానికి లేఖ రాసే చంద్రబాబు ఈ అంశాన్ని లేవనెత్తడం లేదని, ప్రజా వ్యతిరేక చర్యలు అంటూ ఊగిపోయే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. కేసుల భయంతో జగన్ - చంద్రబాబు - బీజేపీతో చేతులు కలిపినందు వల్ల పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నట్లు కనిపిస్తోందని ఎవరికి వారే ఏపీలో గుసగుసలాడుకుంటున్నారట.