అసెంబ్లీ టైంలో జ‌గ‌న్ అంత పొద్దున్నే లేస్తారా?

Update: 2019-07-03 14:30 GMT
ఊరికే గొప్పోళ్లు అయిపోరు. ఉత్త పుణ్యానికే కోట్లాది మంది న‌మ్మ‌కాన్ని.. విశ్వాసాన్ని గెలుచుకోలేరు. అందుకోసం ఎంతో కష్టం.. మ‌రెంతో కృషి ఉంటుంది. అయితే.. అవ‌న్ని అదేప‌నిగా బ‌య‌ట‌కు రావు. కొన్నిసార్లు అనుకోని రీతిలో బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. తాజాగా అలాంటి ఉదంత‌మే ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఎమ్మెల్యేలు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో వ్య‌వ‌హ‌రించ‌టం.. నిబంధ‌న‌ల‌కు సంబంధించిన అంశాల‌తోపాటు.. అసెంబ్లీలో ఎలా వ్య‌వ‌హ‌రించాల్సిన అంశాల‌కు సంబంధించి త‌న ఎమ్మెల్యేల‌కు శిక్ష‌ణ ఇచ్చారు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నోటి నుంచి ఒక ఆస‌క్తిక‌ర అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

త‌న‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త వివ‌రాల్ని జ‌గ‌న్ పెద్ద‌గా ప్ర‌స్తావించ‌రు. అస‌లు అంత‌వ‌ర‌కూ ఆయ‌న సంభాష‌ణ వెళ్ల‌ద‌ని చెబుతారు. అలాంటి ఆయ‌న త‌న గురించి ఒక ఆస‌క్తిక‌ర విష‌యాన్ని చెప్పారు. అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగే స‌మ‌యంలో తాను తెల్ల‌వారుజామున నాలుగు గంట‌ల‌కే లేచేవాడిన‌ని.. స‌భ‌కు సంబంధించిన అంశాల మీద ప్రిపేర్ అయ్యేవాడిన‌ని చెప్పారు. ఉద‌యాన్నే నాలుగు గంట‌ల‌కు నిద్ర లేచి.. ఆ రోజుజ‌రిగే అంశాల మీద ప్రిపేర్ కావ‌టం అంటే.. ఎంత క‌ష్టం.. మ‌రెంత క్ర‌మ‌శిక్ష‌ణ అవ‌స‌ర‌మో ఇట్టే అర్థం కాక మాన‌దు. ఇంత క‌ష్టం చేశారు కాబ‌ట్టే.. ఈ రోజు ఈ స్థాయిలో జ‌గ‌న్ ఉన్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 
Tags:    

Similar News