ఏపీలో రాజకీయం ఎపుడూ లేనంత వేడిగా ఉంది. 40 ఇండస్ట్రీ ఒకవైపు - నవ యవకుడు ఒక వైపు. అసంబద్ధమైన మాటలతో ప్రజల మనసుకు కష్టం కలిగించిన బాబు ఆ విషయం అర్థమయ్యాక పేలవమైన నిరసనలతో రాజకీయం చేసి తన తప్పులకు హోదా ముసుగు వేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పార్టీని- తన కెరీర్ ను పణంగా పెట్టి *ప్రత్యేక హోదా*పై పట్టు వదలకుండా ఉన్నాడు. జనానికి లౌక్యం ఎక్కువ. మీడియా జనాల్ని నమ్మించే రోజులు పోయి జనం మీడియాను ప్రభావితం చేసే రోజులు వచ్చాయి. అందుకే ఇంతకాలం మీడియాను నమ్ముకున్న బాబు ఇక తప్పక జనం మాట ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆలస్యం అయిపోయింది.
ఢిల్లీలో ప్రెస్ మీట్ అదే పోరాటంగా చిత్రీకరించిన బాబు టీడీపీ ఎంపీల చేత రాజీనామా చేయించకుండా ఆగిపోయిన రోజే ఆయన నిబద్ధత అర్థమైపోయింది. తాజాగా ధర్మపోరాట దీక్ష అంటూ పుట్టిన రోజు నాడు తాను చేసే ఉపవాస దీక్షను నిరాహార దీక్ష కింద చూపి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు జగన్ గట్టి అస్త్రం తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రం కోసం ఉపయోగపడని పదవులు ఉన్నా లేకున్నా ఒకటే అని ఏపీ ప్రజల ఘోష ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి రేపు వైసీపీ ఎమ్మెల్యేల చేత మొత్తం రాజీనామా చేయించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈరోజు ఆయన పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యి భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించారు. మన రాజీనామాలు - నిరాహార దీక్షలతో ఢిల్లీ పెద్దలకు ఏపీ ప్రత్యేక హోదా తీవ్రత అర్థమైంది. కాబట్టి ఇదే వేడిలో ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేయిస్తే అటు ఢిల్లీకి భారీ ఝలక్ తగులుతుంది. అంతేకాకుండా మనం మనస్ఫూర్తిగా చేస్తున్న పోరాటానికి ప్రజల మద్దతు కూడా పెరుగుతుంది. దీనివల్ల ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చి ప్రత్యేక హోదాకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంటుందని జగన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల ప్రజల హోదా ఆకాంక్షను ప్రతిబింబించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు.