చంద్రబాబు సలహాలిస్తే తీసుకోవడం లేదట!

Update: 2019-07-24 04:40 GMT
తను సలహాలు ఇస్తున్నా ప్రభుత్వం తీసుకోవడం లేదని అంటున్నారు ఏపీ మాజీ సీఎం - ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. తను జగన్ ప్రభుత్వానికి కొన్ని రోజుల గడువును ఇద్దామని అనుకున్నట్టుగా - తను అంతవరకూ వారికి సలహాలు ఇవ్వాలని అనుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.  అయితే ప్రభుత్వం తన సలహాలనే తీసుకోవడం లేదని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

అసలు సలహాలు ఇచ్చేందుకే అవకాశం ఇవ్వడం లేదని కూడా చంద్రబాబు నాయుడు అన్నారు. అయినా జగన్ ప్రభుత్వం తన సలహాలు తీసుకుంటుందని చంద్రబాబు నాయుడు ఎలా అనుకున్నారో అనేది పరిశీలకుల  మాట.

ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే ఆయన తీరును జగన్ పార్టీ తీవ్రంగా తప్పు పడుతూ వచ్చింది. వివిధ అంశాల్లో చంద్రబాబు నాయుడు తీరును విధానపరంగానే వ్యతిరేకించింది జగన్ పార్టీ. చంద్రబాబు నాయుడు వ్యతిరేక అజెండాతోనే ప్రజల్లోకి వెళ్లింది.

చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారంటూ జగన్ పాదయాత్ర చేపట్టారు. ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు పాలన నచ్చలేదు. తెలుగుదేశం చిత్తు అయ్యింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతికి అధికారం దక్కింది. ఇలాంటి నేఫథ్యంలో ఇప్పుడు తగుదునమ్మా అంటూ చంద్రబాబు నాయుడు సలహాలు ఇవ్వడం ఏమిటనేది ఒక సూటి ప్రశ్న!

ఒకవైపు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్న డొల్లతనాలను బయటపెడుతూ ఉంది. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు మళ్లీ సలహాలు ఇవ్వడానికి రెడీ అని, అయితే ప్రభుత్వం తనకు అవకాశం ఇవ్వడం లేదని వాపోతున్నారు. అయినా సలహాలు వాళ్లు అడిగితే ఇస్తే ఒక గౌరవం. అలా కాకుండే తనే ఉచిత సలహాలు ఇవ్వడానికి వెళ్లడం మాత్రం అంత పెద్దరికం అనిపించుకోదేమోనని  పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News