ఆ మూడు చానెళ్లకు జగన్ సర్కార్ షాక్

Update: 2020-11-30 06:30 GMT
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఐదురోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.  సోమవారం బీఏసీ సమావేశంలో సభ ఎన్నిరోజులు అనేది క్లారిటీ రానుంది. ప్రతిపక్ష టీడీపీ 10 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది.

అయితే తాజాగా అసెంబ్లీలోకి మూడు మీడియా చానళ్లకు అనుమతి నిరాకరించడం చర్చనీయాంశమైంది. దీన్ని ప్రతిపక్ష టీడీపీ మండిపడుతోంది. మూడు చానెళ్లకు వెంటనే లోపలికి అనుమతించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు తాజాగా స్పీకర్ తమ్మినేనికి లేఖ రాశారు.

ఇక ఈ అసెంబ్లీ సమావేశాలకు మీడియాను అనుమతించకుండా.. మీడియా పాయింట్ ను సైతం తీసివేస్తూ ఆదేశాలు ఇవ్వడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో మీడియాను నిషేధించడం అప్రజాస్వామికం అని దుయ్యబడుతోంది.

జగన్ ప్రభుత్వం గతంలోనే జీవోనంబర్ 2430 ద్వారా మీడియా హక్కులను హరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే శిక్షించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోను జాతీయ మీడియా కూడా తీవ్రంగా వ్యతిరేకించిందని టీడీపీ చెబుతోంది. .

తెలుగుదేశం పార్టీ 1998లో ఏపీ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయటం ఆరంభించింది. చాలా రాష్ట్రాలు దీన్ని అనుసరించి ఆమోదించాయి. తాజాగా మీడియాను అనుమతించాలని మండలి చైర్మన్ షరీఫ్ కు టీడీపీ లేఖ రాసింది.
Tags:    

Similar News