పారిస్ ఫ్లైట్ కి వేళాయెనే : జగన్ కి సీబీఐ మోకాలడ్డు

Update: 2022-06-20 15:30 GMT
మూడేళ్ళ సుదీర్ఘ కాలం తరువాత జగన్ తాడేపల్లి ఇంటి నుంచి మెల్లగా  కాలు బయటకు కదిపారు. ఆయన గత నెలలో దావోస్ టూర్ చేశారు. ఏకంగా పన్నెండు రోజుల పాటు ఈ ట్రిప్ సాగింది. ఇక జగన్ జూన్ లో కూడా మరో ట్రిప్ చేపట్టబోతున్నారు. ఈసారి పూర్తిగా అనధికారికమే.

ఆయన సొంత పనుల మీద ఈసారి విమానం ఎక్కబోతున్నారు. తన కుమార్తె అక్కడ చదువుతోందని, స్నాతకోస్తవానికి హాజరు కావాలని తండ్రిగా జగన్ ఆరాటపడుతున్నారు. అయితే దానికి సీబీఐ హోర్టు అనుమతి కావాలి. జగన్ మీద ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న కేసు కోర్టులో విచారణలో ఉంది. దాంతో జగన్ విదేశాలకు వెళ్లాలీ అంటే సీబీఐ కోర్టు అనుమతి తప్పనిసరి.

దాంతో ఆయన తరఫున న్యాయవాదులు అనుమతి కోరుతూ తాజాగా  పిటిషన్ దాఖలు చేశారు. అయితే జగన్ తరచూ విదేశీ పర్యటనలు చేపడుతున్నారని, ఆయనకు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ కోర్టులో వాదించింది.

జగన్ కి అనుమతి ఇస్తే విచారణకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది అని కూడా పేర్కొంది.  అంతే కాకుండా జగన్ పలు కారణాలు చూపించి విదేశాలకు వెళ్తున్నారు అని కూడా ఆరోపించింది.

దీని మీద సీబీఐ కోర్టు విచారణకు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా జగన్ కుమార్తె ఒకరు పారిస్ లో చదువుతున్నారు. అక్కడ చదువు పూర్తి అయింది. స్నాతకోత్సవం ఉంది. దానికి జగన్ హాజరుకావాలనుకుంటున్నారు. మరి సీబీఐ కోర్టు అనుమతి ఇస్తేనే అది సాధ్యపడుతుంది.

అనుమతి దొరికితే కచ్చితంగా వారం పాటు జగన్ పారిస్ ట్రిప్ ఉంటుంది అని అంటున్నారు. అంటే జాలై 2న స్నాతకోత్సవం చూసుకుని జగన్ తిరిగి  రావాల్సి ఉంటుంది. మరి జాలై 4న ప్రధాని మోడీ ఏపీలో టూర్ చేస్తున్నారు అప్పటికి జగన్ ఏపీకి వస్తారా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా దావోస్ టూ పారిస్ అని జగన్ అంటున్నారు. సీబీఐ అనుమతే ఇక్కడ కీలకం.
Tags:    

Similar News