ఏపీ రాజకీయాల్ని ప్రభావితం చేయనున్న ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఈ రోజు (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. దాదాపు ఎనిమిది నెలలకు పైనే సాగనున్న ఈ పాదయాత్రలో ఏపీలోని 13 జిల్లాలను జగన్ కవర్ చేయనున్నారు. మొత్తం 3వేల కిలోమీటర్లు ఆయన నడవనున్నారు.
కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలయ్యే ప్రజా సంకల్ప పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకూ నడవనున్నారు. మొత్తం 125 నియోజకవర్గాలు.. రెండు కోట్ల మంది ప్రజల్ని ఈ పాదయాత్ర ద్వారా జగన్ కలవనున్నారు. ఈ భారీ కార్యక్రమం వెనకున్న భారీ లక్ష్యం తెలిసిందే. ఈ పాదయాత్ర సందర్భంగా అందరూ కనెక్ట్ అయ్యే సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంను జగన్ ఉపయోగించుకోనున్నారు.
తన పాదయాత్ర అనుభవాల్ని ఏ రోజుకు ఆ రోజు అందరికి తెలియజేసేలా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఓ ఆసక్తికర కార్యక్రమానికి జగన్ బ్యాచ్ ఒక కార్యక్రమాన్ని సిద్ధం చేసింది. జగన్ స్పీక్స్ వీడియో సిరీస్‌ను షురూ చేస్తుననారు. ఇందులో తన పాదయాత్ర అనుభవాల్ని వెల్లడించటంతో పాటు.. తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యల్ని జగన్ రోజువారీగా వెల్లడించనున్నారు.
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం అయిన ఫేస్ బుక్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వీడియో సిరిస్ లో భాగంగా తొలి వీడియోలో జగన్ మాట్లాడారు. ఫేస్‌బుక్ లో విడుదల చేసిన తొలి వీడియోలో జగన్ మాట్లాడుతూ.. గతంలో ప్రకటించినట్లే తన పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం ప్రారంభం కానుందని చెప్పారు. వైఎస్సార్ కుటుంబం ద్వారా మీరు నా కుటుంబంలో ఒక్కటయ్యారని.. భాగమయ్యారని.. నన్ను నమ్మి నాతో ప్రయాణం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నట్లు వెల్లడించారు.
దాదాపు ఏడునెలల పాటు సాగే పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తానన్నారు. ప్రజలు చెప్పే ప్రతి అంశాన్ని వింటానని.. కష్టాల్ని.. నష్టాల్ని పరిష్కరించే ఆలోచనలతోనే అడుగులు ముందుకు వేయనున్నట్లు పేర్కొన్నారు. గతంలో నవరత్నాల కార్యక్రమాన్ని తాను వెల్లడించానని.. ఆ నవరత్నాల్ని మరింత మెరుగుపరిచేలా ప్రజలు ఇచ్చే సలహాలు.. సూచనలు తీసుకుంటూ ముందుకు సాగనున్నట్లు వెల్లడించారు. ఫేస్ బుక్ లో పెట్టిన వీడియోను మరో సోషల్ మీడియా అయిన ట్విట్టర్ ద్వారా జగన్ షేర్ చేశారు. మారిన కాలానికి తగ్గట్లు తన పాదయాత్రను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు జగన్ బ్యాచ్ పక్కా ప్లాన్ చేసిందని చెప్పక తప్పదు.
వీడియో కోసం క్లిక్ చేయండి