వైసీపీ మరోసారి ఏపీలో అధికారంలోకి రావాలని తపన పడుతున్న ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో దేన్ని స్పేర్ చేసే పరిస్థితి అయితే అసలు కనిపించడంలేదు. సెంటిమెంట్స్ సహా ఏవో మొహమాటాలను పెట్టుకుంటే పుట్టె మునుగుతుందని ఆలోచనతోనే ముఖ్యమంత్రి కఠిన చర్యలకు సిద్ధపడుతున్నారు అని అంటున్నారు. ప్రస్తుతానికి నలుగురు మంత్రుల మీద వేటు వేయడానికి జగన్ రెడీ అయ్యారు అని వస్తున్న వార్తలు మంత్రులలో తీవ్ర కలకలానికి కారణం అవుతున్నాయి.
అదే టైం లో పనిచేయని మంత్రులకు చివరి హెచ్చరిక కూడా జారీ అయింది. మంత్రివర్గ సమావేశం అనంతరం జగన్ వారికి క్లాస్ తీసుకున్నారు. ఆయిదు నెలలు గడచిపోయినా శాఖాపరంగా పట్టు సాధించలేకపోతున్నారని, ఇకనైనా తీరు మార్చుకోవాలని జగన్ హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చాయి. అదే విధంగా కేవలం మంత్రి పదవి అంటే అధికారం హోదా మాత్రమే అని భావించి ఎంజాయ్ చేస్తున్న వారి గురించిన పూర్తి సమాచారం ముఖ్యమంత్రి వద్ద ఉన్నట్లుగా చెబుతున్నారు.
దాంతో మంత్రులకు తుది హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ఏ మాత్రం ఉపేక్షించని మంత్రుల లిస్ట్ లో నలుగురు ఉన్నారని టాక్. వారిలో మహిళా మంత్రి ఒకరని చెబుతున్నారు. ఆమె కోస్తా జిల్లాలకు చెందిన వారని, కీలకమైన శాఖనే ఆమె నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. అయితే ఆమె శాఖారపరంగా ఏ మాత్రం పట్టు సాధించేలేదని నివేదికలు చెబుతున్నాయి. అదే విధంగా మరో మహిళా మంత్రి కూడా ఉన్నారు. ఆమె తన గురించి ప్రచారం చేసుకోవడంలో పెడుతున్న శ్రద్ధ మంత్రి పదవి నిర్వహణలో శాఖాపరంగా రాణించే విషయంలో పెట్టడం లేదని రిపోర్టులు ముఖ్యమంత్రి వద్ద ఉన్నాయట.
అదే విధంగా గోదావరి జిల్లాలకు చెందిన కన్నబాబుని పక్కన పెట్టి మరీ అదే సామాజికవర్గానికి చెందిన ఒక నేతకు పదవి ఇస్తే ఆయన సైతం నోరు విప్పడంలేదని, కీలకమైన తన శాఖ పట్ల పెద్దగా ఫోకస్ చేయడం లేదని అరోపణలు ఉన్నాయి. ఇదే విధంగా కేవలం కులం కారణంగా రాయలసేమలో ఒక మంత్రి గారికి కంటిన్యూ ఇచ్చారు. కానీ ఆయన యధాప్రకారంగానే ఉంటున్నారు అని తెలుస్తోంది.
ఈ నేపధ్యంలోనే ముఖ్యామంత్రి గట్టిగా చెప్పి చూశారు అని అంటున్నారు. ఇక మాటలు లేవు చేతలే అని ఆయన నిరూపించబోతున్నారు అని తెలుస్తోంది. అక్టోబర్ నాటికి మంత్రిపదవులు చేపట్టిన వారికి ఆరు నెలల గడువు పూర్తి అవుతుంది. అపుడు మరోమారు పనితీరు బేరీజు వేసుకుని నవంబర్ లో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ చేపడతారు అని అంటున్నారు. అంటే కొత్తగా మరో నాలుగు నుంచి ఆరుగురికి ఈ తడవ చాన్స్ ఉంటుంది అని అంటున్నారు.
ఒక వైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ శాఖాపరంగా పట్టు సాధించకపోవడం ఒక ఎత్తు అయితే మరో వైపు విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టలేకపోవడం వంటి కారణాలతోనే ఈసారి గట్టి వారికే చాన్స్ ఇవ్వాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ కి నోరున్న పనిచేసే మంత్రులు కావాల్సిన అవసరం తెలిసొచ్చింది అంటున్నారు. మరి ఈసారి ఎవరికి షాక్ ఇస్తారో, ఎవరిని తీసుకుంటారో చూడాలి. ఈ వార్తలు ఇపుడు వైరల్ కావడంతో గతంలో చాన్స్ తప్పిపోయిన వారు ఇపుడు మంత్రి పదవుల కోసం ఎవరి ప్రయత్నాలు వారు మొదలెట్టారని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.