ప్రముఖుల పెళ్లిళ్లు జరిగినప్పుడు అనుకోని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. అప్పటివరకు అంచనాగా ఉండే కొన్ని అంశాలకు అక్షరరూపం ఇచ్చేందుకు అవకాశం దక్కుతుంది. ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ కొడుకు పెళ్లి హైదరాబాద్ లోని హైటెక్స్ (మాదాపూర్) వద్ద ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కమ్ అప్రకటిత బిగ్ బాస్ కేటీఆర్ హాజరయ్యారు. ఆయన వచ్చినంతనే అప్పటివరకు ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోవటం విశేషం.
ఏపీకి చెందిన తోపు నేతలుగా పేరున్న వారు మొదలు.. వైసీపీకి చెందిన నేతలు ఆయనతో కలిసి సెల్పీలు దిగేందుకు తెగ ఆరాటాన్ని ప్రదర్శించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మంత్రి కేటీఆర్ రాకతో ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ ముఖం వెలిగిపోవటమే కాదు.. ఏదో సాధించినంత హ్యాపీనెస్ ఆయన ముఖంలో కనిపించిందన్నమాట కొందరు నేతల నోట వినిపించటం విశేషం. బొత్స.. కేటీఆర్ పక్కపక్కనే కూర్చోగా.. కేటీఆర్ చేతిని తన చేతిలోకి పెట్టుకొన్న బొత్స తీరు చూస్తే.. సంపన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుక్కి.. అప్పులతో కూరుకుపోయిన రాష్ట్ర మంత్రికి మధ్య వ్యత్యాసం ఇట్టే కనిపించక మానదు.
అంతేనా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడు.. వైసీపీ గొంతుకగా తన గళాన్ని బలంగా వినిపించే అంబటి రాంబాబు లాంటి నేతలు అయితే.. కేటీఆర్ చేతుల్ని తమ చేతితో లాక్కొని మరీ తమ మీద వేయించుకున్న తీరు చూస్తే.. ఏపీ అధికార పక్ష నేతల అతి హద్దులు దాటినట్లుగా ఉందన్న మాట వినిపించింది. ఏపీ రాష్ట్ర మంత్రి ఇంట్లో జరిగిన పెళ్లికి.. పక్క రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి కుమారుడు కమ్ మంత్రి హాజరైతే మరీ ఇంతటి ఉత్సాహాన్ని ప్రదర్శించాలా?

అన్న విమర్శలు వినిపించాయి. ఇంటికి వచ్చిన అతిధిని ఆత్మీయంగా ఆహ్వానించటం తప్పు కాదు. కానీ.. హద్దులు దాటినట్లుగా అనిపించే అతి ప్రేమను ప్రదర్శించిన వైనం చూసినప్పుడు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం ఆసూయ పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే చెప్పాలి.
Went to bless the son of AP MA&UD Minister @BotchaBSN garu yesterday, was overwhelmed with the love from my brothers from AP