ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ జలదీక్ష ముగిసింది. మూడురోజులుగా కర్నూలు వేదికగా చేస్తున్న ఆయన జలదీక్ష మగింపు సందర్భంగా జగన్ ప్రసంగించారు. తొలిరోజు తెలంగాణ.. ఏపీ ముఖ్యమంత్రుల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిన జగన్.. చివరిరోజు చేసిన ప్రసంగం తొలిరోజు దానికి భిన్నంగా ఉండటం గమనార్హం. ఏపీకి జరుగుతున్న అన్యాయం మీద ఏపీ సీఎం చంద్రబాబు మీదనే కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నిప్పులు చెరిగిన ఆయన.. బుధవారం ప్రసంగం మాత్రం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.
కేసీఆర్ ను బతిమిలాడిన ధోరణిలో మాట్లాడిన జగన్.. ఏపీ ముఖ్యమంత్రి మీద మాత్రం చెలరేగిపోయారు. ఏపీకి అన్యాయం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రిని అడిగే దమ్ము ధైర్యం లేదని.. ప్రధాని మోడీకి అల్టిమేటం ఇచ్చే దమ్ము బాబుకు లేదని వ్యాఖ్యానించారు. తన దీక్ష ముగింపు సందర్భంగా తన తర్వాతి దీక్ష గురించిన ప్రకటన చేసేసిన జగన్ చేసిన ప్రసంగాన్ని ఆయన మాటల్లోనే చెప్పేస్తే..
= మూడురోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నాం. మన బాధలు, గోడు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. మన గోడు విని వారిలో మార్పు వస్తుందేమోని పోరాడుతున్నాం. అన్యాయం జరుగుతోంది కాబట్టి ఇవాళ మనమందరం ఇక్కడికి వచ్చి గళం విప్పుతున్నాం.
= కేసీఆర్ ను ఒక్క మాట అడుగుతున్నా. మొన్నటి వరకు మనం కలసి ఉన్నాం, తెలుగే మాట్లాడుతున్నాం, ఒకే రాష్ట్రంగా ఉన్నాం. ఆ రోజు మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులు కడుతున్నప్పుడు మనమందరం కలసి పోరాడిన విషయం గుర్తురాలేదా? కేసీఆర్ గారూ మీ గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. ఇవాళ మీరు కూడా పై రాష్ట్రాల మాదిరే చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో ప్రాజెక్టులు నిండితే గానీ కిందకు నీళ్లు రాని పరిస్థితి. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ఎక్కడకక్కడ ప్రాజెక్టులు కడుతుంటే కింద ఉండే రైతులకు నీళ్లు ఎలా వస్తాయి?
= కేసీఆర్ గారూ మా రాష్ట్రం తెలంగాణపైన ఉండి మేం నీళ్లు ఆపుంటే మీకు నచ్చేదా? ఇవాళ కావాల్సింది అందరూ కలసికట్టుగా ఉండటం. మనం మనం తన్నుకుని గొడవలు పడటం కాదు.వ్యవస్థలో మార్పు తీసుకురావాలి, అన్యాయం జరగకుండా చూడాలి. పై రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక పాలకులు కూడా ఆలోచించాలి.
= పైన వర్షాలు పడినప్పుడు మా నీళ్లు మేమే తీసుకుంటామంటే కిందివారి పరిస్థితి ఏమిటో ఆలోచించాలి. మహారాష్ట్ర, కర్ణాటక నీళ్లు కిందకు ఇవ్వకుంటే తెలంగాణ పరిస్థితి ఏంటి? ప్రతి వర్షం చుక్కలో దామాషా పద్ధతి ప్రకారం ఎవరివాటా ఎంత అని లెక్కలు కట్టి, ఎవరి వాటా నీళ్లు వాళ్లు వాడుకుని మిగిలిన నీళ్లను కిందకు వదలాలి.
= కృష్ణా నది మహబూబ్ నగర్ జిల్లాను దాటుకుని కర్నూలు జిల్లాకు రావాలి. మహబూబ్ నగర్ జిల్లాలో 800 అడుగుల ఎత్తున రోజుకు 30 వేల క్యూసెక్కుల నీళ్లను తోడుకుంటే కిందకు నీళ్లు ఎలా వస్తాయి? గోదావరి నీళ్లు కిందకు రాకుండా తెలంగాణలో ఎడాపెడా ప్రాజెక్టులు కడుతున్నారు. కేసీఆర్ గారూ అధికారం చేతిలో ఉందని పేదవాళ్లమైన మాపై ప్రతాపం చూపడం భావ్యమేనా? ఈ ప్రాజెక్టులకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా అని అడుగుతున్నా?
= శ్రీశైలం ప్రాజెక్టులోకి నీళ్లు రాకుంటే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగడానికి నీళ్లు కూడా ఉండవు. గోదావరిలో రోజుకు 70 వేల క్యూసెక్కులు నీరు వాడుకుంటే కింద ఉన్న ఆయకట్టు పరిస్థతి ఏంటి? ఈ అన్యాయంపై చంద్రబాబు పోరాడుతాడని అనుకుంటే ఆయన నోట ఏ మాటా రాదు. ఎటువంటి పోరాటం చేయడం లేదు.
= కేసీఆర్ ను గట్టిగా అడిగితే ఓటుకు నోటు కేసు బయటకు తీసి, జైల్లో పెట్టిస్తాడని చంద్రబాబుకు భయం. పోనీ ఢిల్లీ వారినైనా, ప్రధాని మోదీనైనా అడుగుతారా అంటే అదీలేదు. మోదీకి అల్టిమేటమ్ ఇచ్చే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదు. ఎందుకంటే చంద్రబాబు 24 నెలల్లో చేసిన అవినీతిపై సీబీఐ విచారణ వేయిస్తారని భయం. చంద్రబాబుకు కేసీఆర్ ను అడిగే ధైర్యం లేదు, మోదీని అడిగే ధైర్యం లేదు. అడిగే ధైర్యం లేనపుడు ఢిల్లీకి ఎందుకు వెళ్లావని చంద్రబాబును అడుగుతున్నా. మోదీతో సమావేశమయ్యాక ప్రత్యేక హోదా వల్ల ఏం లాభం అని ఆయనే అంటారు.
= కేసీఆర్ అడ్డుగోలుగా కడుతున్న ప్రాజెక్టులపై మోదీకి ఫిర్యాదు చేస్తారని ఆశించాం. తీరా చూస్తే ఫిర్యాదు కథ దేవుడెరుగు.. తెలంగాణ ప్రాజెక్టులపై ఓ విలేకరి చంద్రబాబును అడిగితే.. అన్ని అనుమతులు తీసుకుని కట్టాలి, కేంద్రం పరిష్కరించాలి అని అన్నారు
ఇవన్నీ మాకు తెలీవా అని చంద్రబాబును అడుగుతున్నా. వాళ్లు ప్రాజెక్టులు కడుతుంటే నువ్వేమి చేస్తున్నావని అడుగుతున్నా
ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం సిగ్గుచేటు.
= చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక అడ్డుగోలుగా ప్రాజెక్టులు కట్టినా ఏమీ చేయలేకపోయాడు. ఇవాళ తెలంగాణ అదే పనిచేస్తుంటే చంద్రబాబు నోరుమెదపడం లేదు. తాగడానికి నీళ్లు దొరకవని ప్రజలు ఆందోళన చెందుతుంటే చంద్రబాబు నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయిస్తున్నారు. మనకు జరుగుతున్న అన్యాయంపై మనమందరం కలసి కట్టుగా పోరాడాలి.
వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి కలసి కట్టుగా పోరాడాలి. ఇందుకు మీ అందరి దీవెనలు కావాలి. ఈసారి గోదావరి నీళ్ల కోసం పోరాటం చేస్తాం, పోలవరం వేదికగా మరో దీక్ష చేపడుతాం.