ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగులపై వరాల జల్లు కురిపిస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రతి పోస్ట్ ని భర్తీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ వలంటీర్ల ఉద్యోగాలు - గ్రామ - వార్డ్ సచ్చివాలయం ఉద్యోగాలతో దాదాపుగా 3 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించారు. తాజాగా మరోసారి నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసారు.
ఏపీలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో వారందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటానికి కంకణం కట్టుకున్న వైసీపీ ప్రభుత్వం మరో మారు నిరుద్యోగులకు బంపర్ ఛాన్స్ ఇవ్వనుంది. ఏపీ సర్కార్ జనవరిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. 44,941 పోస్టుల భర్తీకి ఈ దఫా శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈసారి నోటిఫికేషన్ ఇవ్వనున్న పోస్టులు శాఖల వారీగా చూస్తే పోలీస్ డిపార్ట్ మెంట్ లో 13,591 పోస్టులు - డి.ఎస్సి లో 20,000 పోస్టులు - గ్రూప్-2 లో 1000 పోస్టులు - గ్రూప్-4 లో 2,600 పోస్టులు - అటవీ శాఖలో 2,750 పోస్టులు ఇతరులు 5000 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. జనవరిలో నోటిఫికేషన్ విడుదల కాకానున్న నేపధ్యంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు నిరుద్యోగుల పాలిట వరంగా మారిందని చెప్పొచ్చు.