ఏపీ ప్రతిపక్ష నేత - వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇల్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని జగన్ స్వయంగా ఆయనే ప్రకటించారు. రాజధాని ప్రాంత రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లిన సందర్భంగా గుంటూరు జిల్లా నిడమర్రులో రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతితో అద్దె ఇంట్లో ఉంటున్నారని, రాబోయే రోజుల్లో తాను ఇల్లు కొనుక్కుని ఇక్కడ ఉంటానని ప్రకటించారు.
రాజధాని నిర్మాణం - రైతుల భూముల సేకరణ వంటి అంశాల గురించి ఈ సందర్భంగా జగన్ ప్రసంగించారు. ప్రజా రాజధాని పేరు చెపుతూ రైతుల నోట్లో మట్టికొట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడ్డారు. రైతులకు ఏదైనా ఆదాయం వచ్చేట్టు చేయాలి కానీ, ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయమని ప్రశ్నించారు. తన బినామీల భూములున్న ప్రాంతాలను రియల్ ఎస్టేట్ జోన్ లో పెట్టి, రైతుల భూములను మామూలు జోన్ లో పెట్టారని జగన్ ఆరోపించారు. రైతులకు ఇచ్చే వాణిజ్య స్థలాల్లో మాల్స్ పెట్టకూడదని ఆంక్షలు విధించారని అదే సమయంలో చంద్రబాబుకు భూములు ఇచ్చిన వారు మాత్రం 22 అంతస్థులు కట్టుకుని మాల్స్ పెట్టేందుకు అనుమతి ఇస్తున్నారని చెప్పారు. రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనేందుకు ఇదే నిదర్శనమని జగన్ విమర్శించారు. రాజధాని రైతులకు అన్యాయం జరగనీయబోమని, ప్రతి రైతుకు అండగా ఉంటామని భరోసా యిచ్చారు. మరో రెండేళ్లు ఎలాగోలా భూములు కాపాడుకుంటే తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమని జగన్ అన్నారు. తర్వాత ఎవరూ భయంతో బతకాల్సిన అవసరముండదని జగన్ భరోసా ఇచ్చారు. రైతులకు అన్ని రకాలుగా వైఎస్సార్ సీపీ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే ప్రజా రాజధాని నిర్మిస్తామని జగన్ ఈ సందర్భంగా ప్రకటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/