ఎంపీల ఆమరణ దీక్ష వద్దకు జగన్?

Update: 2018-04-06 17:14 GMT
ఏపీ ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు ఆ వెంటనే ఏపీ భవన్ వద్ద ఆమరణ దీక్షకు కూర్చున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీల దీక్ష ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిపెంచడమే కాకుండా టీడీపీని దిక్కు తోచకుండా చేసింది. మరోవైపు ఇప్పటికే దిల్లీలో నేషనల్ మీడియా దృష్టిని, ఇతర రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్న వైసీపీ ఎంపీల దీక్ష వద్దకు పార్టీ అధినేత జగన్ రానున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
    
వైసీపీ ఎంపీల దీక్ష జనాల్లోకి వెళ్లకుండా చేయాలన్న ఉద్దేశంతోనే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాదయాత్రల పేరుతో హడావుడి చేశారని వైసీపీ భావిస్తోంది. దీంతో దీక్ష సంగతి జాతీయ స్థాయిలో  అందరికీ తెలిసేలా చేసేందుకు జగనే స్వయంగా వస్తారని భావిస్తున్నారు. ఆయన పాదయాత్రలో ఉన్నప్పటికీ ఒకట్రెండు రోజుల్లో వీలు చేసుకుని దిల్లీ రావొచ్చని వైసీపీ వర్గాలు సైతం అంటున్నాయి.
    
జగన్ దిల్లీ వస్తే నేషనల్ మీడియాతో పాటు ఇతర పార్టీలూ ఈ అంశంపై మరింత ఫోకస్ చేయడం ఖాయం. అప్పుడు ప్రత్యేక హోదా పోరు అందరికీ చేరుతుంది. ఈ వ్యూహంతోనే జగన్ పాదయాత్రలో ఉన్నప్పటికీ దిల్లీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఎంపీల దీక్ష వద్ద వైసీపీ సీనియర్ నేతలంతా ఉండడంతో సందడిగా మారింది. నాయకులు - కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడే ఉండడంతో ఏపీ భవన్‌లో ఎటు చూసినా వైసీపీ పేరే వినిపిస్తోంది.
Tags:    

Similar News