​కారు వదిలేసి.. అందరితో కలిసి బస్సులో జగన్

Update: 2017-03-06 08:42 GMT
చారిత్రక ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినూత్నంగా హాజరయ్యారు. ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోని వెలగపూడిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక అసెంబ్లీ భవనంలో తొలిసారి ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాలు ఈ ఉదయం 11.06 గంటలకు షురూ కావటం తెలిసిందే.

రెగ్యులర్ కి భిన్నంగా తన కారును వదిలేసిన జగన్.. పార్టీ సహచర నేతలతో కలిసి బస్సులో ఏపీ అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు తన టయోటా ఫార్చునర్ లేదంటే ఆడి కారులో అసెంబ్లీకి వచ్చే జగన్ ఈసారి మాత్రం భిన్నంగా పార్టీ నేతలతో కలిసి రావటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. కొత్త అసెంబ్లీ భవనానికి సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన జగన్.. ఈ బడ్జెట్ సమావేశాల్లో దాదాపు 30 అంశాల్ని తెర మీదకు తీసుకురావాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

జగన్ పార్టీ నేతలంతా కలిసి కట్టుగా బస్సులో రాగా.. టీడీపీ మంత్రులు.. ఎమ్మెల్యేలు మాత్రం తమ ఖరీదైన కార్లలో రావటం గమనార్హం. తొలి అసెంబ్లీ సమావేశాలకు చాలా సింపుల్ గా.. కలిసికట్టుగా బస్సులో వచ్చిన జగన్ పార్టీ నేతలు అధికారపక్షాన్ని సర్ ప్రైజ్ చేశారని చెప్పాలి. బస్సులో జగన్ తో పాటు రోజా.. కొడాలి నాని.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సహా పలువురు నేతలు అసెంబ్లీ భవనానికి వచ్చారు.  తొలిరోజు భిన్నంగా వ్యవహరించిన జగన్ పార్టీ నేతలు.. ఈ సమావేశాల్లో అధికారపక్షానికి మరెన్ని షాకులు ఇవ్వనున్నారో చూడాలి.  ​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News