జ‌గ‌న్ ప‌వ‌ర్ ఫుల్ 'క్విట్' ట్వీట్‌

Update: 2017-08-09 13:44 GMT
దేవ స్వాతంత్ర్య స‌మ‌రంలో కీల‌క‌పాత్ర పోషించిన ఉద్య‌మాల్లో ఒక‌టి క్విట్ ఇండియా. ప‌లు ఉద్య‌మాల‌తో తెల్లోడి గుండెల్లో రైళ్లు ప‌రుగులు పెట్టించినా.. క్విట్ ఇండియా అంటూ ఆశేష భార‌తావ‌ని దిక్కులు పిక్క‌టిల్లేలా చేసిన నినాదం బ్రిటీషోడి గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తేలా చేశాయి. స్వాంతంత్ర్య స‌మ‌రంలో కీల‌క‌భూమిక పోషించిన క్విట్ ఇండియా ఉద్య‌మ‌స్ఫూర్తిని తాజాగా ఏపీ విప‌క్ష నేత.. వైఎ్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ట్వీట్ తో త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

75 ఏల్ల క్విట్ ఇండియా ఉద్య‌మానికి ఒక భార‌తీయుడిగా తాను సెల్యూట్ చేస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఉద్య‌మం నిరంత‌రం మ‌న‌కు స్ఫూర్తినిస్తుంద‌న్న ఆయ‌న‌.. మోస‌గాళ్ల‌లారా.. దోపిడీ పాల‌కుల్లారా.. ప్ర‌జావంచ‌కులారా.. క్విట్ ఏపీ అంటూ ట్వీట్ చేశారు. ప్ర‌జావ్య‌తిరేక పాల‌కుల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మించాల్సిన స‌మ‌యం వ‌చ్చిందంటూ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. జ‌గ‌న్ ట్వీట్ ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.


Tags:    

Similar News