అంత‌కు మించి..అనిపించేలా..జ‌గ‌న్ దూకుడు...!

Update: 2019-07-23 06:24 GMT
రాజ‌కీయాల్లో వ్యూహ ప్ర‌తివ్యూహాలు ఉన్న‌ట్టుగానే పాల‌న‌లోనూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంటేనే ఏ ప్ర‌భుత్వ మైనా ముందుకు సాగుతుంది. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌తి ఒక్క‌రినీ సంతృప్తి ప‌రుస్తూ.. ముందుకు సాగిన‌ప్పుడే ప్ర‌భుత్వంపై పూర్తి స్థాయిలో ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం ల‌భిస్తుంది. ఇలాంటి న‌మ్మ‌కాన్ని చూర‌గొన‌డంలోనే వైసీపీ అధినేత‌ - ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తొలి రెండు మాసాల్లోనే `అంత‌కు మించి`-అనేలా పాల‌నను ముందుకు న‌డిపిస్తున్నారు.

వాస్త‌వానికి ఆరు మాసాల గ‌డువు కోరిన జ‌గ‌న్.. ఇంత త్వ‌ర‌గా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. పైగా విభ‌జ‌న క‌ష్టాలు - అప్పుల్లో ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌తి ఒక్క‌రినీ సంతృప్తి ప‌రిచేలా జ‌గ‌న్ వ్య‌వ‌హరిస్తున్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ప్ర‌ధానంగా  రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవులు - నామినేషన్‌ పనుల్లో ఎస్సీ - ఎస్టీలు - బీసీలు - మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు; మొత్తం మీద మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తింపజేసే నాలుగు వేర్వేరు బిల్లులను ప్రభుత్వం  శాసనసభలో ప్రవేశ పెట్ట‌డాన్ని చ‌రిత్ర‌గా అభివ‌ర్ణిస్తున్నారు.

వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖా మంత్రి శంకర నారాయణ ఈ బిల్లులను సభ ముందుంచారు. అన్ని కార్పొరేషన్లు - ఏజెన్సీలు - సొసైటీలు - బోర్డులు - కమిటీల్లో ప్రభుత్వం నియమించే ఛైర్మన్లు - డైరెక్టర్లు - సభ్యుల పదవులకు ఇది వర్తిసుంది. ఆయా కార్పొరేషన్‌ - ఏజెన్సీ - సొసైటీ - లేదా కమిటీని ఒక యూనిట్‌గా చేసుకుని రిజర్వేషన్లు అమలు చేస్తారు. నిజానికి దేశంలోనే ఇలాంటి ప్ర‌తి పాద‌న కానీ - ఇలాంటి కార్యాచ‌ర‌ణ కానీ లేక పోవ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి ఈ త‌ర‌హా ప్ర‌తిపాద‌న‌కు ఆర్థికంగా పెద్ద‌గా ఎలాంటి ఇబ్బందులూ ఉండే అవ‌కాశం లేదు. అయితే, రాజ‌కీయంగా మాత్రం ఇలాంటి నిర్ణ‌యాలు పార్టీల‌పైనా ప్ర‌భుత్వాల‌పైనా ప్ర‌భావం చూపిస్తాయి.

నిజానికి ఇలాంటి కార్య‌క్ర‌మాలు దేశంలో ఎక్క‌డా కూడా చేయ‌క‌పోవ‌డానికి రాజ‌కీయాలే కార‌ణంగా క‌నిపిస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితి ఏపీలో ఉన్న‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ మాత్రం చాలా సాహ‌సంగానే ఈ ప‌నికి పూనుకున్నారు. ప్ర‌తి విష‌యంలోనూ పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేసే జ‌గ‌న్‌.. ఆ త‌ర‌హాలోనే రాష్ట్రంలోని అన్ని ప‌ద‌వుల్లోనూ మ‌హిళ‌ల‌కు - వివిధ సామాజిక వ‌ర్గాల‌కు ఆయ‌న పెద్ద‌పీట వేశారు. దీంతో ఇప్పుడు ఆయా వ‌ర్గాలు  జ‌గ‌న్‌ను కొనియాడుతున్నాయి. అంత‌కు మించి చేయ‌గ‌ల నాయ‌కుడు ఎవ‌రంటూ.. చ‌ర్చిస్తున్నాయి. వాస్త‌వ‌మే క‌దా!!


Tags:    

Similar News