రాజధాని రైతులకు న్యాయం చేసేందుకు జగన్ ముందడుగు

Update: 2020-01-06 05:21 GMT
అమరావతి లో రైతుల ఆందోళనల పై జగన్ సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు ఈ ఆందోళనలు పెయిడ్ ఆర్టిస్టులతో చేయిస్తున్నారని.. దీని వెనుక టీడీపీ నేతలు, రియల్టర్లు ఉన్నారని వైసీపీ ఆరోపించింది. అయితే అమరావతి లో ఆందోళనలు తగ్గకపోవడంతో అసలు రైతుల నిరసన పై ఫోకస్ చేసింది.

నిజంగా రైతులే ఆందోళనలు చేస్తున్నారా? లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో జగన్ సర్కారు నిగ్గు తేల్చడానికి రెడీ అయ్యింది. అమరావతి రైతులకు రాజకీయంగా వ్యూహం మార్చి ఆ ఆందోళనల గుట్టు విప్పడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ అయ్యింది.

ఈనెల 17 లేదా 18వ తేదీల్లో రాజధాని పై హైపవర్ కమిటీ నివేదిక అందించనుంది. ఆ తర్వాత మంత్రి కొడాలి నాని సారథ్యం లో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి రాజధాని రైతులతో చర్చలు జరపాలని యోచిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కొడాలి నాని బాధ్యత తీసుకొని రైతులను చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు. డిమాండ్లు వినిపిస్తే న్యాయం చేస్తామని ప్రకటించారు. చంద్రబాబు మాటలు నమ్మి మోస పోవద్దని సూచించారు.

రాజధాని లో రాజకీయ పార్టీలు ఎంటర్ కావడం.. ఆత్మహత్యలకు పురిగొల్పడం.. ఈ ప్రాంతంలో అనూహ్య మార్పులు, సామాజిక సమీకరణాలను పరిగణ లోకి తీసుకొని ఈ ఆందోళనల గుట్టు విప్పి అసలైన రైతులకు న్యాయం చేసేందుకు వైసీపీ సర్కారు నడుం బిగించింది. ఈ మేరకు చర్చలకు దిగుతోంది.

అయితే రాజధాని మార్చవద్దని ఆందోళన చేస్తున్న రైతులు.. మార్చాలని యోచిస్తున్న వైసీపీ సర్కారు చర్చలు పిలిస్తే వస్తారా రారా అన్నది ఆసక్తిగా మారింది. ఆందోళనకారుల్లో టీడీపీ వాళ్లు ఉండడంతో వారు ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి.


Tags:    

Similar News