ఏపీలో నామినేటెడ్ పోస్టుల భారీ ప్రకటన.. రోజా, జక్కంపూడికి షాక్

Update: 2021-07-17 10:30 GMT
ఏపీ సీఎం జగన్ నేతలపై కరుణ చూపించారు. వరుసగా రెండోసారి భారీగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. అధికారంలో వచ్చిన కొత్తలో ఈ ప్రకటన చేయగా.. తాజాగా మరోసారి భారీ స్తాయిలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు.

ఏపీలో మొత్తం 135 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. ఇందులో మహిళలకు 68, పరుషులకు 67 పదవులు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56శాతం పదవులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీలకే 76 పదవులు కేటాయించారు. బీసీలకు 56శాతం పదవులు ఇచ్చారు. మహిళలకు దాదాపు సగం సీట్లు కేటాయించారు.

-కీలక పోస్టుల్లో ముఖ్యులు వీరే..
ప్రధానంగా చూస్తే టీటీడీ చైర్మన్ గా మరోసారి వైవీ సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు. ఇక బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా సుధాకర్, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గా జోసెఫ్ వెస్లీ, నెడ్ క్యాప్ కు కేకే రాజు, పౌరసరఫరాల కార్పొరేషన్ కు ద్వారంపూడి భాస్కర్ రెడ్డిని నియమించారు. ఇక ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా గేదెల బంగారు, వీఎంఆర్డీఏ చైర్మన్ గా విజయనిర్మల, గ్రంథాలయ చైర్ పర్సన్ గా రెడ్డి పద్మావతి, హితకారిణి సమాజం చైర్మన్ గా మునికుమారిని నియమించారు.కీలకమైన కాపు కార్పొరేషన్ చైర్మన్ గా అడపా శేషు, మారిటైం చైర్మన్ గా కాయల వెంకటరెడ్డి, టిడ్కో చైర్మన్ గా జమ్మాన ప్రస్నకుమార్, డీసీసీబీ చైర్మన్ గా నెక్కల నాయుడు బాబు, ఏపీగ్రీనింగ్ బ్యూటీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్.రామారావు, ఏపీ సామాజిక న్యాయసలహాదారుగా జూపూడి ప్రభాకర్ రావు, తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ గా పద్మజ, ఉర్దూ అకాడమీ చైర్మన్ గా నసీర్ అహ్మద్, ఏపీఐఐసీ చైర్మన్ గా మెట్టు గోవిందరెడ్డిని నియమించారు.

-మరికొన్ని నియామకాలు ఇవీ..
ఏపీ హౌసింగ్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా దవులూరి దొరబాబు
* నాట్యకళ అకాడమీ ఛైర్మన్‌గా కుడుపూడి సత్య శైలజ
* సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్‌గా టి.ప్రభావతి
* రూరల్‌ వాటర్‌ సప్లై సలహాదారుగా బొంతు రాజేశ్వరరావు
* ఏపీ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మొండితోక అరుణ్‌కుమార్‌
* రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అడపా శేషగిరి
* ఏపీ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా షేక్‌ ఆసిఫ్‌
* ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజనల్‌ బోర్డు ఛైర్మన్‌గా తాతినేని పద్మావతి
* ఏపీ కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర్‌రావు
* డీసీఎంఎస్ ఛైర్మన్‌గా అవనపు భావన
* బుడా ఛైర్మన్‌గా ఇంటి పార్వతి
* ఏలేశ్వరం డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా శైలజ
* డీసీసీబీ ఛైర్మన్‌గా నెక్కెల నాయుడుబాబు
* ఉమన్‌ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హేమమాలిని
* ఏపీ గ్రీన్‌ అండ్‌ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రామారావు
* ఏపీ ఎండీసీ ఛైర్మన్‌గా సమీమ్‌ అస్లాం
* సుడా ఛైర్‌పర్సన్‌గా కోరాడ ఆశాలత
* డీసీఎంఎస్ ఛైర్‌పర్సన్‌గా చల్లా సుగుణ (శ్రీకాకుళం జిల్లా)
* డీసీసీబీ ఛైర్మన్‌గా పరిమి రాజేశ్వరరావు (శ్రీకాకుళం జిల్లా)
* గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా సువ్వారి సువర్ణ (శ్రీకాకుళం)
* అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా కోరాడ ఆశాలత (శ్రీకాకుళం)
* కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్‌పర్సన్‌గా చల్లా సుగుణ (శ్రీకాకుళం)
* డీసీసీబీ ఛైర్మన్‌గా కరిమి రాజేశ్వరరావు (శ్రీకాకుళం)
* ఏపీ మారిటైం బోర్డ్‌ ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డి
* ఏపీ టిడ్కో ఛైర్మన్‌గా జమ్మన ప్రసన్నకుమార్‌
* ఏపీఎస్‌ఆర్‌టీసీ రీజనల్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా గేదెల బంగారమ్మ
* గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా రెడ్డి పద్మావతి (విజయనగరం)
* బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్‌పర్సన్‌గా పార్వతి (విజయనగరం)
* డీసీఎంఎస్‌ ఛైర్మన్‌గా అవనాపు భావన (విజయనగరం)
* డీసీసీబీ ఛైర్మన్‌గా నెక్కల నాయుడుబాబు (విజయనగరం)
* గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా తిప్పరమల్లి పూర్ణమ్మ (కృష్ణా)
* కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ (DCMS) ఛైర్మన్‌గా పడమట స్నిగ్ధ (కృష్ణా)
* అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (MUDA) ఛైర్మన్‌గా భవాని (కృష్ణా)
* సహకార సెంట్రల్‌ బ్యాంక్‌(DCCB) ఛైర్మన్‌గా తన్నేరు నాగేశ్వరరావు (కృష్ణా)

-రోజా, జక్కంపూడి, మల్లాది విష్ణుకు షాక్
ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా మంత్రి అవుతారని.. హోంమంత్రి రేసులో  ఫైర్ బ్రాండ్ వైసీపీ ఎమ్మెల్యే రోజా పేరు వినపడింది. నాటి చంద్రబాబు ప్రభుత్వంలో ఢీ అంటే ఢీ అని జగన్ కు అండగా నిలబడ్డ రోజాకు జగన్ ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తాడని అనుకున్నారు. కానీ రోజాకు మంత్రి పదవి సామాజిక సమీకరణాల్లో దక్కలేదు. దీంతో అలిగిన రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని జగన్ కట్టబెట్ారు. ఇప్పుడు ఉన్న పదవి కూడా పోవడంతో రోజాతోపాటు ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

పార్టీ కోసం పదేళ్లుగా పనిచేసే వారికి ప్రాధాన్యత ఇచ్చేందుకు ఎమ్మెల్యేలకు జోడు పదవులు ఉండకూడదని జగన్ పాలసీగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే రోజాతోపాటు మల్లాది విష్ణు, జక్కంపూడి రాజాలు పదవులు కోల్పోయారని తెలిసింది.

రోజా ఏకంగా జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు నామినేటెడ్ పదవి అయిన ఏపీఐఐసీ పోస్ట్ నుంచి తొలగించి మెట్టు గోవర్ధన్ రెడ్డికి కేటాయించారు. అయితే రెండున్నరేళ్లు కావడంతో కేబినెట్ ను విస్తరిస్తారని.. రోజాకు ఈసారి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవి ఇచ్చేందుకే రోజాకు ఉన్న నామినేటెడ్ పదవి తీసేశారని కొందరు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి జగన్ నిజంగానే రోజాకు మంత్రి పదవి ఇస్తారా? అందుకే ఇప్పుడున్న ఏపీఐఐసీ చైర్మన్ పదవి నుంచి తీసేసారా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకుండా ఇప్పుడున్న ఏపీఐఐసీ చైర్మన్ పోస్టు తీసేస్తే మాత్రం రోజాకు అన్యాయం చేసినట్టేనన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.
Tags:    

Similar News