జగన్ మామూలు రాజకీయం చేయడం లేదు. ఆయన రాజకీయంగా ఆరితేరిపోయారు. విపక్షం వ్యూహాలను పసిగట్టిన జగన్ నాలుగు ఆకులు ఎక్కువ చదివారు. అందుకే ఆరు నెలల ముందు ఎన్నికలు అంటున్నారని తెలుస్తోంది. వై నాట్ ముందస్తు ఎన్నికలు అన్నదే ఇపుడు జగన్ లో పట్టుదలగా ఉంది అని తోస్తోంది.
కేవలం పదిహేను రోజుల వ్యవధిలో జగన్ ఢిల్లీకి వెళ్లారంటే అది ముందస్తు ఎన్నికల విషయంలోనే అని రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. జగన్ బుధవారం రాత్రి ఢిల్లీకి సడెన్ ట్రిప్ పెట్టుకున్నారు. ఆయన అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకుని అర్ధరాత్రి వేళ కీలక భేటీని నిర్వహించారని చెబుతున్నారు.
ఈ భేటీ సుమారు నలభై అయిదు నిముషాల పాటు సాగిందని అంటున్నారు. ఈ భేటీ సందర్భంగా ఏపీ రాజకీయాల నుంచి అమిత్ షా ఆరా తీసినట్లుగా చెబుతున్నారు. ఇక జగన్ ముందస్తు ఎన్నికల గురించే చర్చించి ఉంటారని అంటున్నారు. ఏపీలో డిసెంబర్ లో ఎన్నికలు జరిగేలా స్కెచ్ గీశారని చెబుతున్నారు.
డిసెంబర్ లో ఎన్నికలు అంటే తెలంగాణాలో ఎన్నికలతో అన్న మాట. అంటే కెసిఆర్ తో కలసి జగన్ అడుగులు వేస్తారన్న మాట. ముందస్తు ఎన్నికల కోసమే కేంద్రం అనుమతి కోసం వారి మనసులోని మాటను తెలుసుకునేందుకు జగన్ రెండు సార్లు వరసబెట్టి ఇటీవల ఢిల్లీ వెళ్లారని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి.
ఇక అపరచాణక్యుడు చంద్రబాబు సైతం నవంబర్ లో ఏపీలో ఎన్నికలు వస్తాయని తన పార్టీ వారికి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అంటే బాబుకు కూడా దీని మీద ఒక బలమైన సోర్స్ నుంచే మ్యాటర్ వచ్చిందని అంటున్నారు. ఆరు నెలల అధికారాన్ని వదులుకుని ముందుకు వచ్చి ఎన్నికలు పెడితే జగన్ కి వచ్చిన లాభం ఏంటి అంటే ఇప్పటికైతే చూస్తే ఏపీలో ఎన్నికలు పెడితే వైసీపీకి బొటాబొటీగా సీట్లు అధికారానికి సరిపడా వస్తాయని సర్వేలు చెబుతున్నాయట.
అంటే వంద సీట్లు దాకా రావచ్చు అని అంటున్నారు. అదే 2024 మే లో ఎన్నికలు అంటే షెడ్యూల్ ప్రకారం కనుక వెళ్తే కచ్చితంగా సీన్ రివర్స్ అవుతుంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే తెలంగాణాలో ముందుగా ఎన్నికలు జరిగితే ఆ ప్రభావం ఏపీ మీద ఉంటుందని అంటున్నారు. తెలంగాణా ఎన్నికల విషయంలో బీజేపీ తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకుంటే ఏపీలో కూడా అది కంటిన్యూ అవుతుంది.
అదే జరిగితే జనసేన బీజేపీ టీడీపీ కలసి 2014 మాదిరిగా పోటీ చేస్తాయి. ఫలితాలు కూడా సేం టూ సేం అలాగే వస్తాయని ఒక అంచనా ఉంది. దాంతో ఆ కలయిక అసలు వద్దు అన్నదే వైసీపీ ఆలోచన అని చెబుతున్నారు. రెండవ విషయం జనసేన టీడీపీల మధ్య పొత్తులు ఇంకా కుదరలేదు. పవన్ అయితే వరసబెట్టి సినిమాలు చేస్తున్నారు.
ఆయన ఈ సమ్మర్ తరువాత అంటే ఆగస్టు నుంచి వారాహి రధం మీద జనంలోకి రావాలని చూస్తున్నారు. అదే జరిగితే ఏపీలో మొత్తం యాంటీ వైసీపీ వాతావరణాన్ని తన వైపు లాగేయగలరు లేదా కూటమి దిశగా మళ్ళించగలరు అన్నది కూడా వైసీపీ వ్యూహకర్తలను దొలిచేస్తున్న ఆలోచన. అందుకే వారాహి మీద పవన్ బయల్దేరి జనంలో పెద్దగా తిరగకుండానే ఎన్నికలు ఏపీలో జరిపించేసుకుంటే తమ కధ సుఖాంతం అవుతుంది అన్నదే వైసీపీ ప్లాన్ అంటున్నారు.
ఇంకో విషయం ఏంటి అంటే బీయారెస్. ఆ పార్టీ ఏపీలో పోటీకి రెడీ అవుతోంది అని అంటున్నారు. కెసిఆర్ ఏపీకి వచ్చి వైసీపీ మీద గట్టిగా సౌండ్ చేస్తే అది ఆయనకు బెనిఫిట్ ఎంతవరకూ అవుతుందో తెలియదు కానీ టీడీపీ దాన్ని సొమ్ము చేసుకుంటుందని అలా వ్యతిరేకత మరింతగా పెరిగిపోవడానికి కారణం అవుతుదని అంటున్నారు. సో ఆ చాన్స్ ఇవ్వకూడదు అంటే తెలంగాణాతో పాటే ఏపీలో ఎన్నికలు రెడీ అయితే మేలు అన్నదే జగన్ వ్యూహం అంటున్నారు
ఇక వైసీపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితి. ఇప్పటికైతే నలుగురు ఎమ్మెల్యేలు బయట పడ్డారు. మరింతమందికి కూడా అసంతృప్తి ఉందని అంటున్నారు. ఇలా రోజు కొకరు పూటకొకరు బయటకు వచ్చి సౌండ్ చేస్తూ పోతే అంతిమంగా పార్టీకి డ్యామేజ్ చేసే అవకాశం ఉదని వైసీపీ యోచిస్తోంది అని అంటున్నారు. చివరాఖరు విషయం ఏంటి అంటే తమను కాదని బయటకు వెళ్ళి సస్పెండ్ అయిన వారు ఏడాది పాటు నిక్షేపంగా ఎమ్మెల్యే గిరి అనుభవించకూడదు అంటే ఎన్నికలకు వెళ్లడమే మేలు అన్నదే వైసీపీ ప్లాన్.
అందుకే అసెంబ్లీని రద్దు చేసి పారేస్తే అంతా మాజీలు అయిపోతారు అన్నదే అసలైన ఎత్తుగడగా ఉందిట. సో అనేక కారణాలతో ముందస్తుకు వైసీపీ వెళ్ళడానికి రెడీ అవుతోంది అని అంటున్నారు. మరి అమిత్ షా తో అర్ధరాత్రి మంతనాల తరువాత జగన్ కి అనుకూలమైన సమాచారం వచ్చిందా అన్నదే చర్చగా ఉంది. ఢిల్లీలో మరుసటి రోజు కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ని జగన్ కలవడం బట్టి చూస్తూంటే ఆయనకు ఆశలు కలిగించే విధంగానే ఈ టూర్ సాగిందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.