వీరిలో జ‌గ‌న్ కేబినెట్ లో చోటు ద‌క్కేదెవ‌రికి?

Update: 2019-05-24 05:31 GMT
జ‌గ‌న్ ఇప్పుడు విచిత్ర‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌టం ఒక ఎత్తు అయితే.. ఇంత భారీ మెజార్టీతో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌టం ఇప్పుడు ఆయ‌న ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆయ‌న మంత్రివ‌ర్గంలో స్థానం కోసం పోటీ భారీగా పెరిగిన‌ట్లైంది. 175 అసెంబ్లీ స్థానాల్లో 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన నేప‌థ్యంలో మంత్రి ప‌ద‌వుల్ని ఆశించే వారి జాబితా భారీగా పెరిగిన‌ట్లైంది.

ఇప్పుడున్న నిబంధ‌న‌ల ప్ర‌కారం జ‌గ‌న్ కేబినెట్ లో పాతిక మందికి మాత్ర‌మే అవ‌కాశం ఉంది. ఎమ్మెల్యేలు 151 మంది.. మంత్రి ప‌ద‌వులు 25 మాత్ర‌మే ఉండ‌టంతో .. ఒక్కో మంత్రి ప‌ద‌వి కోసం ఆరుగురు ఎమ్మెల్యేలు పోటీ ప‌డే ప‌రిస్థితి. సుదీర్ఘ‌కాలం త‌ర్వాత ప‌దవులు వ‌చ్చిన నేప‌థ్యంలో.. కేబినెట్ లో స్థానం ఎవ‌రికి ద‌క్కుతుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పార్టీ కోసం కృషి చేసిన వారెంద‌రో ఉన్నారు. అలాంటివారితో పాటు.. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా త్యాగం చేసిన వారు ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో చోటు ఎవ‌రికి ద‌క్కుతుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం మంత్రివ‌ర్గం రెండు ద‌శ‌ల్లో ఏర్పాటు చేసే అవ‌కాశం ఉందంటున్నారు. తొలుత ఈ నెల 30న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసే సంద‌ర్భంలో త‌న‌తో పాటు మ‌రో తొమ్మిది మందితో జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తారంటున్నారు. తొలిద‌శ‌లో తొమ్మిది మంది మంత్రులు కేబినెట్ లో ఉంటార‌ని.. ఆ త‌ర్వాత మిగిలిన ఖాళీల్ని భ‌ర్తీ చేస్తార‌ని చెబుతున్నారు. ప్లాన్ ఏ ఇది అయితే.. ప్లాన్ బి ప్రకారం ఒకేసారి ప‌ద‌హారు నుంచి ఇర‌వై మంది వ‌ర‌కూ మంత్రి ప‌ద‌వులు ఇచ్చేసి.. మిగిలిన ప‌ద‌వుల్ని ఆపి.. త‌ర్వాత భ‌ర్తీ చేయ‌టం. వీటిల్లో జ‌గ‌న్ ఏది ఫాలో అవుతారో చూడాలి.

ఇక‌.. మంత్రి ప‌ద‌వుల కోసం ఆశిస్తున్న ఆశావాహుల్ని జిల్లాల వారీగా చూస్తే..

+  శ్రీకాకుళం: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు(శ్రీకాకుళం) - కళావతి (పాలకొండ) - రెడ్డి శాంతి (పాతపట్నం).

+   విజయనగరం: బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి) - పుష్ప శ్రీవాణి(కురుపాం) - రాజన్నదొర(సాలూరు).

+   విశాఖపట్నం: గుడివాడ అమరనాధ్‌(అనకాపల్లి) - గొర్లె బాబూరావు(పాయకరావుపేట) -  ముత్యాలనాయుడు(మాడుగుల).

+   తూర్పుగోదావరి: సుభాష్‌ చంద్రబోస్‌(ఎమ్మెల్సీ కోటా) - కన్నబాబు(కాకినాడ రూరల్‌) - దాడిశెట్టి రాజా(తుని).

+   పశ్చిమగోదావరి: ఆళ్ల నాని(ఏలూరు) - తెల్లం బాలరాజు(పోలవరం) - తానేటి వనిత(కొవ్వూరు) - గ్రంథి శ్రీనివాస్‌ (భీమవరం).

+   కృష్ణా: పేర్ని నాని(మచిలీపట్నం) - ఉదయభాను(జగ్గయ్యపేట) - పార్థసారథి(పెనమలూరు) - మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు(నూజివీడు).

+   గుంటూరు: ఆళ్ల రామకృష్ణారెడ్డి(మంగళగిరి) - మర్రి రాజశేఖర్‌(ఎమ్మెల్సీ కోటా) - అంబటి రాంబాబు(సత్తెనపల్లి) - కోన రఘుపతి(బాపట్ల).

+   ప్రకాశం: బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు) - ఆదిమూలపు సురేష్‌(యర్రగొండపాలెం).

+ నెల్లూరు:  మేకపాటి గౌతంరెడ్డి(ఆత్మకూరు) - రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి(కావలి) - ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి).

+   చిత్తూరు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పుంగనూరు) - కరుణాకర్‌ రెడ్డి(తిరుపతి) - రోజా(నగరి).

+   కడప: శ్రీకాంత్‌ రెడ్డి(రాయచోటి) - అంజాద్‌ బాషా(కడప).

+   కర్నూలు: బుగ్గన రాజేంద్రనాధ్‌ రెడ్డి(డోన్‌) - శ్రీదేవి(పత్తికొండ) - హఫీజ్‌ ఖాన్‌ (కర్నూలు).

+   అనంతపురం: అనంత వెంకట్రామిరెడ్డి(అనంతపురం) - కాపు రామచంద్రారెడ్డి(రాయదుర్గం) - శంకర్‌ నారాయణ(పెనుగొండ).



Tags:    

Similar News