'కొత్తగా బదనాం అయ్యేదేముంది..' కేసీఆర్ తో జగ్గారెడ్డి భేటి?

Update: 2023-02-09 19:43 GMT
ఇటీవల ఓ సర్వేలో తెలంగాణలో బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ కే ఆధిక్యం ఉందని తేలింది. బీజేపీ మూడో స్థానంలోకి పడిపోయిందని అంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీపై ఫోకస్ తగ్గించిన కేసీఆర్ మళ్లీ కాంగ్రెస్ పై పెట్టారు.తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జాగ్గారెడ్డిని లాగేశారు.  

తాజాగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి .. సీఎం కేసీఆర్ తో భేటి అయ్యారు. అసెంబ్లీ హాల్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఇది ఇప్పుడు అటు కాంగ్రెస్ శ్రేణులతోపాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే తాను కేసీఆర్ ను కలిసింది నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల గురించి అని.. మెట్రోలైన్ పొడిగింపు అంశంపై  కేసీఆర్ కు జగ్గారెడ్డి వినతపత్రం సమర్పించారు.

ఇప్పటికే రేవంత్ రెడ్డి అంశం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారగా.. ఈ సందర్భంలోనే జగ్గారెడ్డి కేసీఆర్ తో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటిపై జగ్గారెడ్డి వివరణ మాత్రం ఇంకోలా ఉంది. కాంగ్రెస్ ఎంపీలు మోడీని కలిస్తే తప్పులేదు కానీ.. తాను ఓ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ను కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.

రేవంత్ రెడ్డి తెలంగాణలో పాదయాత్ర చేసిన రెండు రోజులకే తనపై కోవర్టు ముద్ర వేశారని.. కొత్తగా వచ్చే బదనాం ఏముందంటూ తమపై వచ్చే ఆరోపణలను జగ్గారెడ్డి కొట్టిపారేశారు. కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇస్తే ప్రగతిభవన్ కు వెళ్లి మరోసారి కలుస్తానంటూ చెప్పుకొచ్చారు.

రేవంత్ రెడ్డికి.. జగ్గారెడ్డికి అసలు పడడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్ ను జగ్గారెడ్డి కలవడం సంచలనమైంది. దీంతో ఖచ్చితంగా జగ్గారెడ్డి పార్టీ వీడుతారన్న ప్రచారం మొదలైంది. ఏం జరుగుతుందన్నది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News