కోట్లు ఖర్చు పెట్టాను.. పీసీసీ చీఫ్ నాకివ్వట్లే!?

Update: 2020-12-25 02:30 GMT
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన పీసీసీ చీఫ్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్లు చేస్తున్న ప్రయత్నాాలు అన్నీఇన్నీ కావు. ఈ క్రమంలో రాష్ట్రానికి వచ్చి ఇక్కడి నేతల అభిప్రాయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్.. అధిష్టానికి రిపోర్టు చేశారు.

పీసీసీ చీఫ్ జాబితాలో ఫైనల్‌గా ఐదుగురు నేతల పేర్లు ఉన్నట్టు సమాచారం. వీరి లోంచే ఈ నెలాఖరులో కొత్త పీసీసీ చీఫ్‌పై అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు. అయితే.. ఫైనల్‌ లిస్ట్‌లో తన పేరు లేదన్న లీక్‌పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి.

పీసీసీ పదవిపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానన్నారు జగ్గారెడ్డి. కానీ, పార్టీలో ఉన్న నాయకులు చీలిపోకుండా నిర్ణయం జరగాలని ఆశిస్తున్నట్టు తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇక, సోనియా గాంధీకి పంపించిన లిస్ట్‌లో తన పేరు అధిష్టానం వద్ద చర్చకు లేకపోవడం దురదృష్టకరమైన విషయమని అన్నారు.

2017 సంవత్సరంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సంగారెడ్డిలో రాహుల్ గాంధీ కోసం భారీ బహిరంగ సభ కార్యక్రమం తనకు అప్పగించినప్పుడు.. ఆ కష్ట కాలంలో తాను కోట్ల రూపాయలు పెట్టి సభ నిర్వహించానన్నారు. అయినా.. తన పేరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు చర్చలో లేకేపోకవడం చాలా బాధ కలిగించిందన్నారు. రాష్ట్రానికి కొత్తగా వచ్చిన ఇంఛార్జ్ ఈ కార్యక్రమాల గురించి తెలుసుకోకపోవడం, నా లాంటి ఆర్గనైజర్ పేరు ఢిల్లీ లిస్ట్‌లో పంపకపోవడం చాలా బాధకు గురిచేసిందని తన ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు జగ్గారెడ్డి.
Tags:    

Similar News