సభలో జై రామ్ నినాదాలు.. మాట్లాడకుండా వెనుదిరిగిన దీదీ!

Update: 2021-01-24 06:15 GMT
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్ కతాలోని నేషనల్ లైబ్రరీని ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మమతాబెనర్జీ ప్రధాని ముందు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సభలో మాట్లాడకుండానే వెనుదిరిగారు.ఇంతకీ సభలో  ఏం జరిగిందంటే..  నేతాజీ జయంతి సభలో మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా కొంతమంది జై శ్రీరామ్,  భారత్ మాతాకి జై..అంటూ నినాదాలు చేశారు. కొంతమంది అధికారులు కల్పించుకొని నినాదాలు చేయొద్దని వారించి నా వారు వినలేదు. దీంతో మమత  వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిలిచి  అవమానించడం ఏమిటని ప్రధాని మోదీని పరోక్షంగా విమర్శించారు.

తాను ప్రసంగించ బోనని చెబుతూ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపి జై బంగ్లా నినాదాలు చేసి వేదిక నుంచి దిగిపోయారు.   మమత జై బంగ్లా నినాదాలు చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ప్రధాని మోదీ, బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కార్ వేదికపై ఉన్న సమయంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.అనంతరం సభలో మాట్లాడిన ప్రధాని మోదీ మమతా బెనర్జీ తన సోదరిగా అభివర్ణించారు.  ఈ కార్యక్రమంలో భరతమాతను తలచుకోవడం మామూలేనని శ్రీరాముడిని తలచుకునే సందర్భం ఇది కాదని ఆయన వ్యాఖ్యానించారు.

 దేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ పాగా వేసేందుకు బీజేపీ  ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పైన బీజేపీ దృష్టి పెట్టింది. నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్లో ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి తృణమూల్  కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలను తమ పార్టీ లోకి లాగేసుకుంది. ఇప్పటికే టీఎంసీలో కీలక నేత అయిన సువేందు అధికారి, పలువురు మంత్రులను బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. ఎలాగైనా ఈసారి టీఎంసీని ఓడించేందుకు బీజేపీ  ప్రణాళికలు రచిస్తోంది.
Tags:    

Similar News