చైనా విదేశాంగ మంత్రితో జై శంకర్ భేటీ ..దేనికంటూ సుబ్రహ్మణ్యస్వామి అసహనం !

Update: 2020-09-08 09:50 GMT
భారత్ , చైనా   సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళుతున్న విదేశాంగ మంత్రి జై శంకర్, నేడు టెహ్రాన్‌లో ఆగిపోయే అవకాశం ఉంది. అక్కడ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇరుదేశాలకు సంబంధించి ధ్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. షాంఘై సహకార దస్సులో పాల్గొనేందుకు జై శంకర్ మాస్కో వెళ్తున్నారు.  అయితే , ఈ భేటీ పై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చైనా డిఫెన్స్‌ మినిస్టర్‌ వెయి ఫెంఘెతో భేటీ అయిన తర్వాత మళ్లీ జైశంకర్‌ మాస్కో వెళ్లడం ఎందుకు అని ప్రశ్నించారు.

విదేశాంగ విధాన పరంగా.. ఈ ఏడాది మే 5 తర్వాత భారత్‌, చైనాతో పరిష్కరించుకోవాల్సిన సమస్యలేవీ లేవని, అలాంటప్పుడు ఆ దేశ విదేశాంగ మంత్రితో జైశంకర్‌ భేటీ అనవసరం అన్నారు. ఇలాంటి విషయాలు ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలను పలుచన చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే స్పందించి భారత విదేశాంగ మంత్రి రష్యా పర్యటనను రద్దు చేయాలనీ ట్విటర్‌ ద్వారా కోరారు. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నా కూడా చైనా తీరు మాత్రం మార్చుకోవడంలేదు. పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో ఇటీవల మరోసారి వాస్తవాధీన రేఖ  వెంబడి ఘర్షణ వాతావరణం తలెత్తింది.

ఈ  శుక్రవారం మాస్కోలో షాంఘై సహకార సంస్థ  సమయంలోనే  సదస్సు సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌, చైనా రక్షణ మంత్రి వెయి ఫెంఘెతో దాదాపు రెండు గంటల 20 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఎల్ ‌ఏసీను చైనా గౌరవించాలని, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలు మానుకోవాలని స్పష్టంచేశారు. భారత్‌ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు కట్టుబడి ఉందని.. ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పర్యటనకై జైశకంర్‌ మంగళవారం రష్యాకు బయల్దేరనున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మళ్లీ  విదేశాంగ మంత్రితో మళ్లీ భేటీ ఎందుకు అంటూ అసహనం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News