గిన్నీస్ రికార్డులో జ‌ల్లిక‌ట్టు.. ప్రాణాలు పోయినా...

Update: 2019-01-21 06:05 GMT
సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే సంప్రదాయ క్రీడ జల్లికట్టు(పరుగెత్తుతున్న ఎద్దులను నిలువరించడం) పోటీ గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్ సృష్టించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో ఎడ్లు పోటీలో పాల్గొన్నాయి. 2017లో 647 ఎడ్లతో జల్లికట్లు నిర్వహించగా ఈ ఏడాది 1354 ఎడ్లు పాల్గొన్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు మృతి చెందగా, కొంతమంది ప్రేక్షకులతో పాటు 31 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వాస్తవంగా 2000 ఎడ్లతో జల్లికట్టు నిర్వహించాలని తలపెట్టినా సమయాభావం వల్ల సాధ్యం కాలేదని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 500 మంది పేర్లు నమోదు చేసుకోగా, 424 మంది పాల్గొన్నారు.

గిన్నిస్‌ రికార్డుల్లో చోటు సంపాదించాలన్న ప్రయత్నంలో భాగంగా విరాళి మలైలో తొలుత 2,000కుపైగా ఎద్దులను బరిలోకి దించాలని భావించినప్పటికీ వీలు కాలేదు. 1,354 ఎద్దులను రంగంలోకి దించిన నిర్వాహకులు వీటిని పట్టుకునేందుకు మాత్రం 424 క్రీడాకారులనే అనుమతించారు. పోటీలో ఎద్దుల సంఖ్య ఎక్కువ, పాల్గొనేవారి సంఖ్య తక్కువ కావడంతో క్రీడాకారులతో పాటు సందర్శకులకు కూడా వైద్య బీమా కల్పించారు. ఎద్దులతో జరిగిన పోరులో దాదాపు 31 మంది గాయపడ్డారు. తిలకించేందుకు వచ్చిన వారిపైకి ఎద్దులు దూసుకు పోవడంతో రాము(25), సతీష్‌(43) అనే వారు ప్రాణాలు కోల్పోయారు.

కాగా, 2017లో ఇదే రీతిలో గిన్నీస్ రికార్డ్ కోసం జ‌రిగిన ప్ర‌య‌త్నం 19 ఏళ్ల‌ యువకుడితో పాటు మ‌రో ముగ్గురు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. జల్లికట్టులో ఈ విధంగా పలువురు గాయపడటం, ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ తమిళనాడు ప్రభుత్వం, పలు రాజకీయ పార్టీలు జల్లికట్టును ప్రోత్సహిస్తూ ప్రకటనలు చేయడం విశేషం.


Full View
Tags:    

Similar News