ఏపీ - తెలంగాణల్లో 'జంబలికిడి పంబ'.. ఫేస్ బుక్ లో పోస్టులు!

Update: 2020-08-31 04:45 GMT
ఏ రాష్ట్ర సీఎం ఆ రాష్ట్రంలోని అసమ్మతులకు నచ్చదు. తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే కాంగ్రెస్ వాళ్లకు పడదు.. ఏపీ సీఎం జగన్ అంటే టీడీపీ వాళ్లకు పడదు. అందుకే పక్కరాష్ట్రం సీఎంలతో పోలుస్తూ వారే కావాలంటూ సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. ఇప్పుడు ఇదే వైరల్ అవుతోంది.

అప్పుడెప్పుడో రాజేంద్రప్రసాద్ సినిమా ‘జంబలకిడి పంబ’ పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఏపీ, తెలంగాణల్లో ఫేస్ బుక్ పోస్టులు చూస్తే అలాగే అనిపిస్తోంది. ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు చూసి.. తెలంగాణలో కేసీఆర్ అంటే పడని సోషల్ మీడియా మాకు జగన్ సీఎం కావాలని  కొత్తగా డిమాండ్ మొదలు పెట్టారు.

అలాగే కేసీఆర్ ఏపీలోని నాయుడుపేటలో ఒక టెంపుల్ కు ఆర్థికసాయం చేశాడు. ఆ దేవాలయాన్ని బాగా అభివృద్ధి చేశాడు. దీంతో ఏపీలో జగన్ అంటే పడని కొంతమంది ఏపీకి కేసీఆర్ సీఎం కావాలని పోస్టులు పెడుతున్నారు. ఈ విధంగా రివర్స్ సైడ్ పోస్టులు పెడుతుంటే ‘జంబలికిడి పంబ’ సినిమా గుర్తుకు వస్తోందని పలువురు సెటైర్లు వేస్తున్నారు.
Tags:    

Similar News