అమెరికా మల్టీనేషనల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సేవలు అందించే 'జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో' సీఈవో జేమీ డిమన్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిట్ కాయిన్ ను విలువ లేని ఇన్వెస్ట్మెంట్గా పేర్కొన్నారు. ''వ్యక్తిగతంగా నా దృష్టిలో అదొక నాన్సెన్స్. సీరియస్ ఇన్వెస్ట్ మెంట్ అనుకోవడం మూర్ఖత్వం. దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా క్లయింట్లు విషయపరిజ్ఞానం ఉన్నవాళ్లు. వాళ్లు కూడా దీనిని అంగీకరించరు అంటూ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఈవెంట్ లో ఇలా ముక్కుసూటి వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే మొదటి నుంచి ఆయన బిట్ కాయిన్ పట్ల వ్యతిరేకతతోనే ఉన్నారు. బిట్ కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీ లను 'మూర్ఖుల బంగారం'గా అభివర్ణించిన డిమన్.. అమెరికాలోనే అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజమైన తాము ప్రొత్సహించబోదని, దానిపై ప్రభుత్వాల నియంత్రణ కచ్చితంగా ఉండాలని గతంలో ఆయన వ్యాఖ్యానించారు కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఎదిగిన చైనా.. దానివల్ల పర్యవసనాలు చెడువే జరుగుతున్నాయంటూ ఈమధ్యే నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఓవైపు ఎలన్ మస్క్ లాంటి కుబేరులు క్రిప్టోకరెన్సీకి తెగ ప్రమోట్ చేస్తుంటే..మరోవైపు ఇంకొందరు ధనికులు మాత్రం పూర్తిగా దానికి వ్యతిరేక గళం వినిపిస్తున్నారు.
క్రిప్టో కరెన్సీ మేజర్ బిట్ కాయిన్ విలువ తిరిగి రికార్డు స్థాయికి చేరుకుంటున్నది. న్యూయార్క్ లో సోమవారం ఇంట్రా డే ట్రేడింగ్‌లో 4.3 శాతం పెరిగి 57,829 డాలర్లు పలికింది. ఏప్రిల్‌లో ఆల్ టైమ్ రికార్డు 65వేలకు చేరుకుని.. తర్వాత మే నుంచి పడిపోతూ వచ్చిన బిట్ కాయిన్ గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది దాదాపు బిట్ కాయిన్ విలువ రెట్టింపైంది.
బిట్ కాయిన్ లావాదేవీలపై అమెరికా, చైనా ప్రభుత్వాలు ఆంక్షలు సడలించాయి. బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ కు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (యూఎస్ ఎస్ ఈ సీ) ఆమోదం తెలుపుతుందన్న ఆశల మధ్య ట్రేడర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తోంది. ప్రత్యేకించి బిట్ కాయిన్ ఫ్యూచర్స్ ఈటీఎఫ్ లపై ఇన్వెస్టర్లు ఆసక్తితో ఉన్నారు. బిట్ కాయిన్ ను డెరివేటివ్ బేస్‌డ్ ప్రొడక్ట్‌గా పరిగణించాలని యూఎస్ రెగ్యులేటర్ చైర్ గ్యారీ గెన్ స్లెర్ సంకేతాలిచ్చారు. దీంతో బిట్ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు మొగ్గు చూపుతున్నారని బిట్‌వైజ్ ఇన్వెస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హంటర్ హార్స్‌లే చెప్పారు. మున్ముందు బిట్ కాయిన్ 60 వేల డాలర్లకు దూసుకెళ్తుందన్న అంచనాలు ఉన్నాయి.