బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న `కౌన్ బనేగా కరోడ్ పతి` సీజన్ 9...ఆగస్టు 28న ప్రారంభమైంది. గత సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ కు విపరీతమైన టీఆర్పీలు వస్తున్నాయి. తనదైన శైలిలో బిగ్ బీ ఈ షోను రక్తి కట్టిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సీజన్ లో ఎవరూ జాక్ పాట్ ప్రైజ్ మనీ 7 కోట్ల రూపాయలు గెలుచుకోలేదు. అయితే, సెప్టెంబర్ 28న షూటింగ్ పూర్తి చేసుకున్న ఎపిసోడ్ లో ఓ మహిళా పార్టిసిపెంట్ కరోడ్ పతి అయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జంషెడ్ పూర్ కు చెందిన సోషల్ వర్కర్ అనామికా మజుందార్ కోటి రూపాయలను గెలుచుకున్నట్లు ఆ కథనాలలో ప్రచురించారు. గురువారం రాత్రి పూర్తయిన ఆ ఎపిసోడ్ వచ్చే నెలలో ప్రసారం కానుందట.
`కౌన్ బనేగా కరోడ్ పతి` సీజన్ 9లో మొదటి కరోడ్ పతిగా జంషెడ్ పూర్ కి చెందిన అనామిక మజుందార్ నిలిచినట్లు తెలుస్తోంది. ఆగస్టు 28న ప్రారంభమైన కేబీసీ-9 లో ఇప్పటి వరకు ఎవరూ రూ. కోటి గెల్చుకోలేదు. అయితే, గురువారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లో అనామిక రూ. కోటి గెల్చుకుందని తెలుస్తోంది. ఈ షోలో చివరి ప్రశ్నఅయిన రూ. 7 కోట్ల జాక్ పాట్ ప్రశ్నను అనామిక వదిలేసిందని కథనాలు వెలువడ్డాయి. కోటి రూపాయల ప్రశ్నకు చేరుకునే సరికే అనామికకు లైఫ్ లైన్ లు పూర్తయ్యాయని, కోటి రూపాయల ప్రశ్నకు అనామిక సమాధానం చెప్పడం ఆమె తల్లికి ఇష్టం లేదని సమాచారం. అయితే, అనామిక తన నాలెడ్జ్ తో - విశ్లేషణా సామర్థ్యం తో కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం ఇచ్చి బిగ్ బీ ని కూడా ఆశ్చర్యపరిచిందని తెలుస్తోంది. ఆమె టాలెంట్ కు బిగ్ బీ కూడా ఫిదా అయిపోయారట. జంషెడ్ పూర్ కు చెందిన అనామిక `ఫెయిత్ ఇన్ ఇండియా - ఫీమేల్ ఆరా` పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది. తాను గెల్చుకున్న కోటి రూపాయలను ఈ సంస్థ ద్వారా జార్ఖండ్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తానని అనామిక చెప్పినట్లుగా సమాచారం. అయితే, అనామిక ఎపిసోడ్ కు అతిథిగా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు హాజరైనట్లుగా తెలుస్తోంది.