పవన్ కు తిరగబెట్టిన సమస్య.. తీవ్ర అనారోగ్యం

Update: 2019-09-26 15:30 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు తాజాగా జనసేన పార్టీ విడుదల చేసిన లేఖ ఆయన అభిమానులను కలవరపరుస్తోంది. పవన్ ఎంతో బాధను అనుభవిస్తున్నాడని.. ఎన్నికల నుంచే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది. కానీ ఆపరేషన్ చేయించుకోకుండా పంటి బిగువన పట్టి దాన్ని అనుభవిస్తున్నట్టు తాజాగా జనసేన పార్టీ విడుదల చేసిన లేఖతో స్పష్టమైంది.

 ఈరోజు విజయవాడలో జరిగే ‘మీడియా సమావేశానికి’ పవన్ కు ఆహ్వానం అందింది. అయితే ఆ సమావేశానికి సడన్ గా పవన్ హాజరు కాలేదు. తీవ్రమైన అనారోగ్యంతో మంచాన పడినట్టు జనసేన పార్టీ లేఖలో పేర్కొంది. ఈ సందర్భంగా మీడియా పోరాటానికి జనసేన పార్టీ తరుఫున మద్దతిస్తున్నట్టు పవన్ తెలిపారు.

పవన్ కు వచ్చిన అనారోగ్యాన్ని కూడా ఆ లేఖలో వివరించారు. ‘గబ్బర్ సింగ్ ’ సినిమా షూటింగ్ లో ఆయన వెన్నుపూసకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటినుంచి వెన్నునొప్పి బాధిస్తోందట.. అసెంబ్లీ ఎన్నికల్లో అది పెరగగా ఫారిన్ కు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అయితే ఆ సమస్యను అశ్రద్ధ చేయడంతో తాజాగా మళ్లీ వెన్నునొప్పి తిరగబెట్టింది.

మూడు రోజుల నుంచి పవన్ కాలు బయటపెట్టకుండా మంచానికే పరిమితమై రెస్ట్ తీసుకుంటూ చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిసింది. వెన్నునొప్పి సమస్యతోనే పవన్ ‘సైరా’ ప్రిరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నట్టు తెలిసింది. అయితే ఆపరేషన్ అవసరం అని డాక్టర్లు తెలుపగా.. ప్రకృతి చికిత్స ద్వారా పవన్ దాన్ని కంట్రోల్ చేస్తానని తెలిపారని పార్టీ వర్గాలు లేఖలో పేర్కొన్నాయి.
    

Tags:    

Similar News