ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చాలా చూడాలి అంటున్నారు జనసేన నేతలు. మా పార్టీని చిన్న చూపు చూస్తూ మేము ఏమీ కామని అంటున్న వైసీపీ నేతలకు ఇదే మా అటాక్ అని ఒక బలమైన నాయకుడిని తమ వైపు లాగేసుకున్నారు. ఆయన కందుల నాగరాజు అనే విశాఖ కార్పొరేటర్. ఆయన తెలుగుదేశం, కాంగ్రెస్ ల నుంచి అలా తిరుగుతూ 2019 నాటికి వైసీపీలో చేరారు. అయితే 2021లో జరిగిన ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు.
దాంతో ఆయన తన సొంత బలం చూపించారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. గెలిచాక ఆయన వైసీపీకి అనుబంధ సభ్యుడిగా ఉంటూ వచ్చారు. ఇక ఆయనకు వైసీపీలో సరైన గౌరవం లేదని భావించారో లేక పెద్ద పదవుల మీద కన్నేశారో తెలియదు కానీ సడెన్ గా కండువా మార్చేశారు. ఆయన జనసేనలో చేరిపోయారు.
ఆయన 32వ వార్డు నుంచి కార్పోరేటర్ గా గెలిచారు. దాంతో ఆయన వచ్చే ఎన్నికల్లో సిటీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. జనసేన పార్టీ ద్వారా అయితే తన కోరిక తీరుతుందని కందుల నాగరాజు భావిస్తున్నారుట. ఇక ఆయన ఒక్కడే కాదని చాలా మంది తమ వైపు చూస్తున్నారు అని జనసేన నేతలు అంటున్నారు.
వైసీపీ 2021 ఎన్నికల్లో జీవీఎంసీలో సొంతంగా 57 సీట్లు గెలిస్తే మరో అయిదారుగురు ఇండిపెండెంట్లు గెలిచారు. వారంతా వైసీపీకి మద్దతుగా ఉన్నారు. వీరిలో విశాఖ సౌత్ నుంచి కొందరు గెలిచారు. వారు ఇపుడు అక్కడ వైసీపీతో విభేదిస్తున్నారు. తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి టికెట్ ఇవ్వవద్దని వారు డిమాండ్ చేసినా అధినాయకత్వం పెడచెవిన పెడుతోంది.
దాంతో వారిలో కొందరు సైతం జనసేన వైపు గా మారుతారు అని టాక్ నడుస్తోంది. అదే జరిగితే కార్పోరేషన్ లోనే కాదు విశాఖ సిటీలో కూడా జనసేన బలం బాగా పెరుగుతుంది అని అంటున్నారు. నిజానికి విశాఖ సిటీలో వైసీపీ గతంలో కొంత పుంజుకున్నా మళ్ళీ ఇపుడు గ్రాఫ్ తగ్గిపోయింది. 2019లో చూస్తే నాలుగు ఎమ్మెల్యే సీట్లూ తెలుగుదేశం పరం అయ్యాయి.
ఇపుడు బలం పెంచుకుందామనుకున్నా ప్రభుత్వ వ్యతిరేకత గట్టిగా ఉంది. దానికి తోడు విశాఖ సిటీలో ఎక్కువగా విద్యావంతులు, మేధావులు, మధ్యతరగతి వర్గాలు ఉంటాయి. దాంతో వైసీపీకి పట్టు దొరకడం లేదు అని అంటున్నారు. ఈ పరిణామాలను చూసిన కొందరు కార్పోరేటర్లే కాదు కీలక నాయకులు కూడా గట్టు దాటేస్తారు అని అంటున్నారు. మరి అదే కనుక జరిగితే విశాఖలో తెలుగుదేశం జనసేన రెండూ స్ట్రాంగ్ ఫోర్స్ గా మారుతాయని అంటున్నారు. వైసీపీ నుంచి తొలి బోణీని లాగేసిన జనసేన బిగ్ షాట్స్ మీద దృష్టి పెట్టింది అని అంటున్నారు. చూడాలి మరి బడా నేతలు ఎందరు వచ్చి చేరుతారో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.