దేశ సరిహద్దుల్లో ఉన్న కశ్మీర్ లో రాళ్లు రువ్వే ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఆందోళనకు దిగుతున్న అక్కడి విద్యార్థులు, నిరసనకారులు భద్రతా దళాలపై రాళ్లతో దాడి చేస్తున్న విషయం తెలిసిందే. వాళ్లను తరిమికొట్టేందుకు భద్రతా సిబ్బంది పెల్లెట్ గన్స్ వాడుతున్నారు. అయినా రాళ్లు రువ్వే కశ్మీర్ యువతను అడ్డుకునే పరిస్థితి లేదు. ఆ అల్లరిమూకలను ఎదుర్కొనేందుకు కాన్పూర్ కు చెందిన జనసేన అనే సంస్థ ఓ వెరైటీ సైన్యాన్ని తయారు చేస్తోంది.
రాళ్లు రువ్వే కశ్మీర్ యువతను ఎదుర్కొనేందుకు కాన్పూర్ లోని సాధువులు రాళ్లు రువ్వడంలో శిక్షణ పొందుతున్నారు. ఇందులో స్త్రీలు, పురుషులు ఉన్నారు. రాళ్లు రువ్వే వారిని ఎదుర్కునేందుకు ఈ సాధువులు ఈ శిక్షణ తీసుకుంటున్నారు. సాధువులంతా మే 7వ తేదీన జమ్మూకశ్మీర్ వెళ్లనున్నారు. భారత ఐకమత్యాన్ని దెబ్బతీస్తున్న కశ్మీర్ యువతకు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే రాళ్లు రువ్వే సైన్యాన్ని తయారు చేస్తున్నట్లు జనసేన అధిపతి చేతన్ మహాపురి తెలిపారు. వేలాది సంఖ్యలో సాధువులు కశ్మీర్ కు వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. మిలిటెంట్లను ఎదుర్కొనేందుకు సాధువులు చేస్తున్న ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో వేచి చూడాల్సిందే.
ఇదిలాఉండగా...జమ్ము కశ్మీర్ లోని హంద్వారాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థులు ఆందోళన చేస్తూ, పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీనితో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు, పోలీసులు గాయపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/