'హిందూ ఫోబియా తగదు'.. హిందూ సంఘాల ఇంట్రస్టింగ్ కామెంట్స్!
కెనడాలోని ఖలిస్థానీలు మరోసారి రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... బ్రాంప్టన్ లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని, భక్తులపై దాడులు చేశారు.
కెనడాలోని ఖలిస్థానీలు మరోసారి రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... బ్రాంప్టన్ లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని, భక్తులపై దాడులు చేశారు. దీనికి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలోనే ఆలయం వద్ద భారీగా భద్రతా బలగాలను మొహరించారు.
ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భక్తులపై ఖలిస్థానీలు చేస్తున్న దాడులకు సంబంధించిన వీదియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఉత్తర అమెరికాలోని హిందూ సంఘాల ఆధ్వర్యంలో బ్రాంప్టన్ హిందూ మహసభ ఆలయం వెలుపల భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు.
అవును... కెనడలోని సిక్కు వేర్పాటువాదులు ఖలిస్తానీ జెండాలతో బ్రాంప్టన్ లోని హిందూ సభ దేవాలయ ప్రాంగణంలో వీరంగం సృష్టించి, భక్తులపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... కెనడా, భారత్ జెండాలు చేతపట్టి భక్తులు సోమవారం రాత్రి వెయ్యి మందికి పైగా భారీ ర్యాలీ నిర్వహించి, నిరసనల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన హిందూ సంఘాలు... హిందు దేవాలయాలపై పెరుగుతున్న ఆకస్మిక దాడులకు నిరసనగా బ్రాంప్టన్ లో వెయ్యి మందికి పైగా కెనడియన్ హిందువులు ఆందోళనల్లో పాల్గొన్నారని తెలిపాయి. ఈ సందర్భంగా... ఇలాంటి దాడుల్ని కట్టడి చేయాలని కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశాయి. హిందూ ఫోబియా తగదని హితవు పలికాయి.
ఇదే సమయంలో... ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ... కెనడాలో హిందూ ఆలయంపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో భారత దౌత్యప్వెత్తలను బెదిరించే పిరికిపంద ప్రయత్నాలు కూడా అంతే దారుణమైనవని తెలిపారు. ఇలాంటి చర్యలు భారతదేశ దృఢనిశ్చయాన్ని బలహీనపరచలేవని అన్నారు.
అదేవిధంగా... కెనడా ప్రభుత్వం న్యాయం చేస్తుందని, చట్టబద్ధమైన పాలనను నిలబెడుతుందని ఆశిస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
ఈ నేపథ్యంలోనే... దాడి వెనుక భారత వ్యతిరేక శక్తుల హస్తం ఉందని కెనడా రాజధాని ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. భారత వ్యతిరేక శక్తుల దాడితో తమ క్యాంపు కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని.. ఈ చర్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయని భారత హై కమిషన్ "ఎక్స్" వేదికగా వెల్లడించింది.