బద్వేలో బీజేపీకి మద్దతుపై జనసేన కీలక నిర్ణయం

Update: 2021-10-09 07:25 GMT
బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ ఏకగ్రీవం చేయాలని కోరుతూ వైదొలిగిన సంగతి తెలిసిందే. అధికార వైసీపీ ఇక్కడ మరణించిన వైసీపీ ఎమ్మెల్యే భార్యనే నిలబెట్టడంతో మానవత్వం కోణంలో జనసేన ఇక్కడ పోటీచేయడం లేదని చెప్పి వైదొలిగింది. అయితే జనసేన మిత్రపక్షం బీజేపీ మాత్రం ఇక్కడ పోటీకి సై అన్నది.

తాజాగా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇవాళ పార్టీ వ్యవహారాల ఇణ్చార్జీ నాదెండ్ల మనోహర్ కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ పార్టీతోనే జనసేన కలిసి ఉంటుందని.. బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ తరుఫున అభ్యర్థిని నిలబెట్టడం లేదని తెలిపారు..

ఏపీలో బీజేపీతో జనసేన పొత్తు ఉన్నందున బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు ఇస్తుందని తేల్చిచెప్పారు. వచ్చే రోజుల్లో కూడా పొత్తు కొనసాగుతుందని పేర్కొంది. ఈ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రచారంపై త్వరలోనే క్లారిటీ ఇస్తామన్నారు.

బీజేపీతో పొత్తులో ఉన్నామని.. ధర్మాన్ని పాటిస్తామని.. బీజేపీ విజయం కోసం పనిచేస్తామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా మారిపోయిందని.. గుంతలు లేని రోడ్డు ఒక్కటి కూడా లేదని ఆరోపించారు. రోడ్లపై తమ పోరాటం కొనసాగుతుందని నాదెండ్ల స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద సహచర మంత్రులు, ఎమ్మెల్యేలకు కనీసం నమ్మకం లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీతో జనసేన కలిసే ఉంటుందని.. ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు అని జనసేన స్పష్టం చేసింది.



Tags:    

Similar News