వైసీపీ ఎంత రెచ్చగొట్టినా....పవన్ వ్యూహం అదే...?

Update: 2022-11-01 02:30 GMT
పవన్ కళ్యాణ్ణి వైసీపీ కాపు మంత్రులు రెచ్చగొడుతున్నారు. అది ఇవాళ కొత్తగా కాదు, చాలా కాలంగానే ఆయన మీద మంత్రులు, మాజీ మంత్రులు కూడా విమర్శలు చేస్తున్నారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము ఉందా సత్తా ఉందా అంటూ సవాల్ చేస్తున్నారు. అయితే పవన్ రాజకీయంగా రాటుదేలారు. ఆయన ఎవరి కోసమో లేక ఎవరో ఏదో రెచ్చగొట్టారనో తన రాజకీయాలు తన వ్యూహాలు మార్చుకోరు.

ఆయనకు ఏపీలో వైసీపీ ఉండకూడదు, అది ఫస్ట్ టార్గెట్. ఆ తరువాతనే ఆయనకు పదవులూ మరేదైనా. నిజానికి పవన్ చాలా సార్లు తన పార్టీ కార్యకర్తల సమావేశంలోనే చెప్పుకొచ్చారు. తనకు పదవుల కంటే రాష్ట్రం ముఖ్యం, అభివృద్ధి ముఖ్యమని. ఆ విధంగా తరచూ చెప్పడం ద్వారా ఆయన వారిని బాగానే  మౌల్డ్ చేశారనుకోవాలి.

ఇక కాపు యువత పవన్ వెంట పెద్ద ఎత్తున ఉన్నారు. వారంతా పవన్ ఏమన్నా సై అంటారు. పవన్ సీఎం అయినా వారికి ఓకే. లేక ఆయన త్యాగమూర్తిగా ఉంటూ తానే మరొకరిని సీఎం గా చేశాను అని జబ్బలు చరచినా ఆ గర్వం తమకు చాలు అనుకుంటారు. ఇలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనబడే వారే ఈ రోజున జనసేనలో ఉన్నారు. అందువల్ల వారంతా పవన్ ఫిలాసఫీనే తాము వంటబట్టించుకుని పాలిటిక్స్ చేస్తున్నారు.

సో వారితో పవన్ కి ఇబ్బంది లేదు. ఆయన ఎలా అంటే వారు అలానే ఉంటారు. మధ్యలో ఇపుడు వైసీపీకి ఇబ్బంది వస్తోంది. పవన్ సీఎం అవాలని పార్టీ వారు అనుకుంటే ఆయన మాత్రం తాను తగ్గి చంద్రబాబుని గెలిపిస్తున్నారు అని. అయితే పవన్ వ్యూహం వేరే ఉంది. చంద్రబాబుని ఈ తడవ సీఎం ని చేస్తే ఆయన వచ్చే ఎన్నికల నాటికి అంటే 2029 నాటికి ఎనభయ్యేళ్ల వారు అవుతారు.

ఆ తరువాత బాబు స్థాయిలో టీడీపీలో ఆ స్థాయి రాజకీయం చేసేవారు లేరు. పైగా టీడీపీకి హార్డ్ కోర్ గా ఉన్న కమ్మ సామాజికవర్గం కూడా జనసేనకు టర్న్ అయ్యే చాన్స్ ఉంది. మరో వైపు జగన్ పవన్ దాదాపుగా ఒకే ఈడు వారు. అందువల్ల ఏ విధంగా చూసుకున్నా జగన్ తనకు బలమైన ప్రత్యర్ధిగా ఫ్యూచర్ లో ఉంటారని పవన్ చాలా తెలివిగానే లెక్క వేస్తున్నారు. 2024 ఎన్నికల్లో జగన్ మరోసారి గెలిస్తే పవన్ రాజకీయ ఆశలు గల్లంతు అయినట్లే. అందుకే ఆయన ఈ స్టెప్ తీసుకున్నారు అని అంటున్నారు.

అందుకే ఈ ఎన్నికలతోనే జగన్ ని ఇంటికి పంపిస్తే ఇక 2029 నాటికి వైసీపీ ఏ రూపంలో ఉంటుందో కూడా ఎవరూ అంచనా వేయలేరు. అపుడు తనకు రాజకీయంగా అవకాశాలు అత్యంత మెండుగా ఉంటాయని ఆయన నమ్ముతున్నారు. మొత్తానికి పవన్ మార్క్ స్ట్రాటజీ కరెక్ట్. అందుకే వైసీపీ వారు ఎంత రెచ్చగొట్టినా ఆయన పొత్తులతోనే వస్తారు అని అంటున్నారు. పొత్తులు కనుక ఉంటే వైసీపీకి అది ఓటమినే కలిగిస్తుంది అని ఆ పార్టీ కంగారు పడుతోంది. మొత్తానికి వైసీపీ చేతిలో ఏణ్ణర్ధం అధికారం ఉందనగానే వారిలో కలవరం రేపిన ఘనత మాత్రం పవన్ కే దక్కుతుంది అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News