ఏపీ ప్రత్యేక హోదా కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన సభ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన ఈ 'సీమాంధ్ర హక్కుల చైతన్య సభ' కోసం ప్రత్యేకంగా ఓ పాటను రూపొందించారు. సభకు ముందునుంచి... సభ రోజున ఈ పాటను విస్థృతంగా వాడుతూ ప్రజలకు అవగాహన కలిగించడానికి... వారిలో చైతన్యం రగిలించడానికి దీన్ని రాసినట్లు చెబుతున్నారు. ఉద్యమాలకు పాటలే వెన్నెముకలన్న ఉద్దేశంతోనే పవన్ ఏరికోరి ఈ పాటను రాయించుకున్నట్లు చెబుతున్నారు.
''ప్రజల గుండె రగిలెరా.." అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ ను పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఈ పాటను బద్రీనాయుడు రాయగా, ఎమ్మెస్ వాసు పాడారు. కాగా పాట వినగానే ఉత్తేజం కలిగించేలా ఉంది.
నవంబర్ 10వ తేదీన అనంతపురంలో ఈ సీమాంధ్ర హక్కుల చైతన్య సభను నిర్వహిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజి ప్రాంగణంలో నిర్వహించనున్న సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక హోదా అంశంతో పాటు అనంతపురంలో కరవు, సాగు తాగునీరు తదితర అంశాలపై కూడా పవన్ మాట్లాడబోతున్నారు. ముందుగా పాటను కూడా రిలీజ్ చేయడంతో పవన్ ప్రసంగం కూడా అదే స్తాయిలో ఉంటుందని... పక్కాగా ప్రసంగాన్ని రూపొందించారని చెబుతున్నారు.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/