జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక అనేక రకాలైన విమర్శలు ఎదుర్కొన్నారు. మొదట్లో ఆయన వీటిని సీరియస్ గా తీసుకున్నా ఇపుడు మాత్రం సర్దుకున్నారు. అన్న వారు అంటారులే అన్న ధోరణితో ఉన్నారు. అయినా సరే అపుడపుడు పవన్ని సైతం బాధించే కామెంట్స్ రాజకీయాలలో ప్రత్యర్ధులు చేస్తూ ఉంటారు. ఎక్కువగా వైసీపీ నుంచే ఆ కామెంట్స్ రావడం విశేషం.
ఇదిలా ఉంటే జగన్ తొలివిడత మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులు ఎక్కువగా జగన్ని టార్గెట్ చేసేవారు. వారు కన్నబాబు, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్. వీరిలో కన్నబాబు ప్రజారాజ్యం తరఫున రాజకీయాల్లోకి వచ్చారు.
పేర్ని నాని చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడు. అయినా ఈ ఇద్దరూ తమ సొంత సామాజికవర్గం అని ఎక్కడా పవన్ని అసలు స్పేర్ చేయలేదు. వారితో పాటు అనిల్ కుమార్ అయితే పవన్ కళ్యాణ్ కి వీర భక్తుడు. అయినా రాజకీయం రాజకీయం అన్న లెక్కన ఆయన పవన్ మీద ఎపుడూ జోరు చేసెవారు.
దాంతో అపుడపుడు కొడాలి నాని కూడా మసాలా చేరిస్తే జనసైనికులు కిర్రెక్కిపోయేవారు. ఇపుడు ఆ బాధ్యత మలివిడతలో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమరనాధ్ తీసుకున్నారు. ఆయన పవన్ తోనే వెటకారం ఆడేశారు. విశాఖ విమానాశ్రయంలో పవన్ తనతోనే ఫోటో తీయించుకోవడానికి ఉబలాటపడ్డారంటూ అప్పట్లో చేసిన కామెంట్స్ జనసైనికులకు మంట పుట్టించాయి.
ఇక ఆ మధ్యన అయితే పవన్ వ్యక్తిగత విషయాల్లోకి కూడా గుడివాడ వెళ్ళి కెలికి వదిలిపెట్టారు. ఇక లేటెస్ట్ గా చూస్తే పవన్ తమ పార్టీకి మూడు ఆప్షన్లు ఉన్నాయని చెప్పుకొస్తే పవన్ కి మూడు మీద మోజు ఎపుడూ పోదు అంటూ ఆయన మూడు పెళ్ళిళ్ల గురించి ఇండైరెక్ట్ గా సెటైర్లు వేశారు. దాంతో జనసైనికులకు ఒక్క లెక్కన మండిపోతోందిట. అంతే కాదు పవన్ సైతం ఈ యువ మంత్రి మీద ఫుల్ ఫోకస్ పెట్టారు అని అంటున్నారు. వీలు దొరికితే వచ్చే ఎన్నికల్లో ఓడించి పారేయాలని కూడా డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో కేవలం ఎనిమిది వేల ఓట్ల తేడాతో . అనకాపల్లిలో గుడివాడ టీడీపీ మీద గెలిచాయి. అపుడు అనకాపల్లిలో జనసేనకు దాదాపుగా పన్నెండు వేల దాకా ఓట్లు వచ్చాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో పొత్తులు కనుక కుదిరితే గుడివాడ సునాయాసంగా ఓడిపోవడం ఖాయమని అంటున్నారు. మరి పొత్తులు లేకపోతే మాత్రం జనసేన కోరిక తీరేది లేదు. కానీ మేము ఒంటరిగా అయినా మంత్రికి గుణపాఠం చెబుతామని జనసైనికులు అంటున్నారు. చూడాలి మరి యువ మంత్రి ఈసారి గెలిస్తాడో లేదో.